అంగ రంగ వైభవంగా కొండదిగిన అహోబలేశ్వరు జ్వాలానృసింహుడు
అహోబిలం స్టూడియో భారత్ పత్రినిధి
అంగ రంగ వైభవంగా కొండదిగిన అహోబలేశ్వరు జ్వాలానృసింహుడు
అహోబిలం
అంగ రంగ వైభవంగా కొండదిగిన జ్వాలానృసింహుడు,పారువేటకై కొండ దిగిన కొండంత దేవుడు....40 రోజులపాటు 33 గ్రామాలలో శ్రీ అహోబిలేశ్వరులు విజయం చేస్తారు.మరెక్కడా లేని వైభోగం అహోబిలేశుని సొంతం.రేపు అనగా 16.01.2026 నాడు శ్రీ అహోబిలేశ్వరులు పారువేటకై అహోబిలం నుండి బయలుదేరుతారు.పారువేటకై ఎగువ అహోబిలం నుండి శ్రీ జ్వాల నరసింహ స్వామి వారు దిగువ అహోబిలమునకు వేంచేశారు.శ్రీ స్వామివారు దిగువ అహోబిలం గ్రామ పొలిమేర ఈ పారువేట ఉత్సవాన్ని ప్రారంభించిన అహోబిల మఠం స్థాపనాచార్యులు శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికులు పూర్ణకుంభముతో స్వాగతం పలికారు.
కొండ దిగిన అహోబలేశ్వరులను దిగువ అహోబిలం చేరగానే పారువేట ఉత్సవాలను ప్రారంభించి ,జనులందరికి అహోబలేశ్వరులను చేరువ చేసిన అహోబిల దేవాలయ ధర్మకర్త,అహోబలేశ్వరులచే సన్యాసాశ్రమును స్వీకరించిన వారు శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులైన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామి ,దర్శన తాంబూలం సమర్పించి,సమస్త రాజోపచారములతో దిగువ అహోబిలం ఆలయానికి తీసుకొని వచ్చారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0