కోడి పందాలు, జూదం నిర్వహించినా, పందెం బరులు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు
వైయస్ ఆర్ కడప స్టూడియో భారత్ పత్రినిధి
కోడి పందాలు, జూదం నిర్వహించినా, పందెం బరులు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు
వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్
వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖ
సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం,కోడి పందాలు మరియు గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు హెచ్చరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోడిపందేలు,జూదం జరిగే అవకాశమున్న అనుమానిత ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచడం జరుగుతుందని,వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్.పి తెలిపారు.
జూదం, కోడి పందేలు, గుండాట, అక్రమ మద్య విక్రయాలు, మద్యం అక్రమ రవాణా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పైన కఠినంగా వ్యవహరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోడి పందేల బరులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో గల పోలీసు అధికారులు, సిబ్బంది జూదం, కోడి పందాలు చట్టరీత్యా నిషేధం అని తెలియజేస్తూ అటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.కోడి పందేల నిర్వహణ వేదికలకు ఎవరైనా తోటలు, స్థలాలు ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్.పి హెచ్చరించారు.
జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా కోడి పందేలు జరుగుతున్నా, జరిగే వీలున్నా వెంటనే డయల్ - 112 కు ఫోన్ చేస్తే తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి తనిఖీలు, దాడులు నిర్వహించనున్నట్లు ఎస్.పి తెలిపారు.ఇప్పటికే జిల్లాలో ఉన్న పోలీసు అధికారుల కు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయం, వై.ఎస్.ఆర్ కడప జిల్లా.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0