కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయనున్న ఇండియన్ నేవీ..
కలకత్తా స్టూడియో భారత్ పత్రినిధి
కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయనున్న ఇండియన్ నేవీ.. చైనా, పాక్ కు చెక్.
పశ్చిమ బెంగాల్ తీరం, బంగాళాఖాతంలోని, హల్దియాలో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని,ఇండియన్ నేవీ భావిస్తోంది.ఇక్కడ స్వల్ప స్థాయి యుద్ధ నౌకల్ని మోహరించనుంది.ఇప్పటికే అక్కడ ఉన్న డాక్ కాంప్లెక్స్ కు ఉపయోగపడుతుంది.అది కూడా తక్కువ స్థాయి నిర్మాణాలు,నౌకల ద్వారా త్వరగా సేవలందించేందుకు వీలవుతుంది.
ఇక్కడ ఫాస్ట్ ఇంటర్ సెప్టార్ క్రాఫ్ట్స్, 300 టన్నుల న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వంటివి నిలిపేందుకు వీలుంటుంది. 40-50 నాట్ల వేగంతో వచ్చే నౌకల్ని కూడా నిలిపి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తారు.అలాగే, ఆధునిక గన్స్, ఆయుధాలు ఉంచేందుకు అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో హిందూ మహా సముద్రం, బంగాళాఖాతంలో చైనా నేవీ దూకుడు చర్యలకు దిగుతోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0