వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి

studiobharat devotinal

Jan 11, 2026 - 10:29
 0  6
వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి

వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకొందాం........!!

కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది. అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి.

అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి.

ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news