సహజ సంపద పై రాష్ట్రంలో ఏయంఆర్ గుత్తేదారు పెత్తనం 

స్టూడియో భారత్ పత్రినిధి

Jan 23, 2026 - 00:22
 0  138
సహజ సంపద పై రాష్ట్రంలో ఏయంఆర్ గుత్తేదారు పెత్తనం 

సహజ సంపద పై రాష్ట్రంలో ఏయంఆర్ గుత్తేదారు పెత్తనం 

విజయవాడ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ సంపద అధికారికంగా దోపిడికి గురౌతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.గత వైకాపా ప్రభుత్వం సహజ సంపద అయిన ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కే గుత్తేదారు నికి అప్పగించడం జరిగిందని ప్రజలు ఆరోపించారు.దీనితో స్థానిక ప్రజలు సహజ సిద్దంగా ఏర్పడిన ఇసుక వాడకం లో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడారని పలువురు అంటున్నారు.దీనితో అధిక ధరతో ఇసుకను కొనుగోలు చేసి పేదలు ఇండ్ల నిర్మాణం చేయడం జరిగిందని,ఇటువంటి వైఖరిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జగన్ ని ఓడించడంలో ఇదొక పాత్ర కీలక భూమిక పోషించిందని ప్రజల నుండి బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీని వల్ల ప్రజలు చీకొట్టిన జగన్ విధానాన్ని ప్రస్తుత పాలకులు గా ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుకను అందించడం జరుగుతుందని,కాని రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో మైనింగ్ మరియు రాయి ని మాత్రం ప్రజలు వాడటానికి ఏయంఆర్ సంస్థకి టన్నుకి ఇంత అని డబ్బులు వసూలు చేయడానికి అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనిని ఆసరా తీసుకొని ఇదే అదునుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏయంఆర్ గుత్తేదారు సంస్థ స్థానిక ప్రజల అవసరాలను సైతం దొడ్డిదారిన సొమ్ము చేసుకుంటుందని,దీనికి అధికార పార్టీ కొమ్ము కాస్తుందని మేధావులు ఆరోపిస్తున్నారు.సహజ సంపదలను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టి ప్రైవేటు గుత్తేదారులకు అప్పగించిన గత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దించిన కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేయడం సిగ్గుచేటు అని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఇటు వంటి సహజ సంపద దోపిడికి అనుమతులు ఇవ్వడం వెనుకాల మర్మం ఏమిటని,ఈ విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, రాబోయే కాలంలో సహజ సంపద దోపిడికి అధికారికంగా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పడం జరుగుతుందని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news