శ్రీ వల్మికోద్బవ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవికి పెరిగిన ఆశావాహులు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి
శ్రీ వల్మికోద్బవ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవికి పెరిగిన ఆశావాహులు ....
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి గ్రామంలో ఉన్న శ్రీ వల్మికోద్బవ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇప్పుడు కేవలం ఒక నియామకం కాకుండా, స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది. చైర్మన్ పదవి కాలం ముగియడంతో కొత్త ఎంపికపై గ్రామస్థులు, పార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఆశావాహులు ఈ పదవిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కళ్యాణపు సూర్యప్రకాశరావు, కొందరు పేర్లు వినిపిస్తున్నప్పటికీ,ఈసారి ప్రధానంగా యాదవ సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ కనిపిస్తోంది.గుమ్మా వెంకటేష్,గుమ్మా హేమంత్,ఆవుల రామారావు,కొరకూటి సైదులు వంటి నాయకులు తమ అభ్యర్థిత్వాన్ని బలంగా వినిపిస్తూ,వర్గపరంగా కూడా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఆర్యవైశ్యులు నుండి పేరూరి నర్సింహారావు,కాకరపర్తి సోమేశ్వరావు రేసులో ఉన్నారు.
ముఖ్యంగా గుమ్మా వెంకటేష్ ముందుగానే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం అతనికి ఒక వైపు మద్దతును తెచ్చిపెట్టినా,మరోవైపు సొంత సామాజిక వర్గం అతనికి ఇవ్వద్దు అని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.అతని మీద రాజకీయంగా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఈ పరిణామం వల్ల మరింత జాగ్రత్తగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
ఇక గుమ్మా హేమంత్ విషయానికి వస్తే, పట్టభద్రుడైన యువ నాయకుడిగా,తిరుమలగిరి గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి చెందిన వారసుడిగా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రామ స్థాయిలో ప్రజలతో అనుసంధానం,యువతలో ఉన్న మద్దతు,కుటుంబ రాజకీయ నేపథ్యం ఇవి అతనిని బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి.ముఖ్యంగా “స్థానికుడికి అవకాశం” అనే భావన పెరుగుతున్న నేపథ్యంలో అతనికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదే సమయంలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన 8వ వార్డ్ మాజీ కౌన్సిలర్ కొరుకూటి సైదులు కూడా పోటీలో తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నారు.ఆయన నేరుగా మాజీ మంత్రివర్యులు,కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మరియు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారిని కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.ఇది ఆయన సీరియస్ కాండిడేట్‌గా ఉన్నారని సంకేతంగా భావిస్తున్నారు.
ఆవుల రామారావు కూడా తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడిగా ఉండటం వత్సవాయి మండలంలో కొన్ని గ్రామాల్లో ఓటింగ్ ప్రభావితం చేయగలిగిన నాయకత్వం ఆవులు రామారావు సొంతం.నెట్టెం రఘురాం గారి శిష్యుడిగా రాజకీయ ఆరాగ్రేట్రం చేసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారి ఆశీస్సులతో నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గంలో ముందుకు సాగుతున్నాడు.యాదవ సామాజిక వర్గ ముఖ్య నాయకులు కొందరు అతనికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఎస్టీ వర్గానికి చెందిన కొందరు కూడా పోటీలో ఉండటం,వైశ్య సామాజిక వర్గం కూడా ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని బలంగా కోరడం— ఎంపికను మరింత క్లిష్టంగా మార్చబోతున్నాయి.ప్రతి వర్గం తమకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించడం వల్ల,నాయకత్వానికి సమతుల్య నిర్ణయం తీసుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యత నెట్టెం రఘురాం మరియు శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య)గార్ల పై ఉంది.వీరు సాధారణంగా కేవలం వ్యక్తిగత ప్రభావం మాత్రమే కాకుండా,భవిష్యత్ రాజకీయ లాభనష్టాలు,పార్టీ బలపాడటానికి దోహదపడే అంశాలు,సామాజిక సమతుల్యత ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మొత్తానికి,తిరుమలగిరి దేవస్థానం చైర్మన్ పదవి ఇప్పుడు జగ్గయ్యపేట రాజకీయాల్లో ఒక కీలక పరీక్షగా మారింది.వెంకన్న స్వామి సేవ చేసే ఈ గౌరవనీయమైన అవకాశం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0