జలధార–జలహారతి పథకం జగ్గయ్యపేటలో పూర్తి జాడే లేదు

జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి

Jul 11, 2026 - 11:24
 0  22
జలధార–జలహారతి పథకం జగ్గయ్యపేటలో పూర్తి జాడే లేదు

జలధార–జలహారతి పథకం జగ్గయ్యపేటలో పూర్తి జాడే లేదు

చెరువుల తవ్వకాలు నిలిచిపోయాయి.. 

రైతులకు అందని నీటి భరోసా ...

దొడ్డిదారిన అనుమతులు లేకుండానే చెరువుల త్రవ్వకాలు

జగ్గయ్యపేట: 

రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ,వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం,భూగర్భ జలాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రకటించిన జలధార–జలహారతి పథకం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో చెరువులు పూడికతో నిండిపోయి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పూర్తి స్థాయిలో జలధార జలహారతి పథకం ప్రారంభం నుండే అమలు కాకపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

చెరువుల ఎంపికలో జాప్యం.రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం.పరిపాలనా అనుమతులు ఆలస్యం కావడం.నిధుల విడుదలలో ఆలస్యం లేదా ప్రాధాన్యత తగ్గడం.చెరువు గట్లు, ఫీడర్ కాలువలపై ఆక్రమణలు తొలగించకపోవడం.టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడం లేదా కాంట్రాక్టర్ల ఆసక్తి తగ్గడం.స్థానిక స్థాయిలో ప్రతిపాదనలు సకాలంలో పంపకపోవడం ప్రధాన కారణం గా చెప్పుకోవచ్చు.

రైతుల ఆవేదన ఎక్కువగా చెరువులు పూడికతో నిండిపోవడంతో వర్షపు నీరు నిల్వ కాక భూగర్భ జలాలు పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ప్రాంతాలలో బోర్లపై ఆధారపడాల్సి రావడంతో సాగు ఖర్చులు పెరిగాయని,పశువులకు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని పేర్కొంటున్నారు.

నిపుణుల అభిప్రాయం చెరువుల పూడిక తొలగిస్తే నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు మెరుగుపడతాయి. ఫీడర్ కాలువలను శుభ్రం చేసి ఆక్రమణలు తొలగిస్తే ప్రతి వర్షాకాలంలో చెరువులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంటుంది.

ప్రజల మాత్రం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అన్ని చెరువులపై ప్రత్యేక సర్వే.పూడిక తొలగింపు పనులను వెంటనే ప్రారంభించడం.వేపలవాగు, యర్రకాల్వ వంటి నీటి మార్గాలపై ఉన్న ఆక్రమణలను తొలగించడం.పనుల పురోగతిని ప్రజలకు అందుబాటులో ఉంచడం.గ్రామస్థాయి పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు చేయాలని రైతులు కోరుకుంటున్నారు 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news