మూతబడబోతున్న కర్మాగారాలు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి
మూతబడబోతున్న కర్మాగారాలు ....
ఒక్క పక్క ప్రభుత్వ పన్నుల భారం....
మరో పక్క కాలుష్యం పేరుతో కొందరు ఆందోళన ...
రాష్ట్రంలో కర్మాగారాల యాజమాన్యం పెట్టుబడుల పై యాజమాన్యాలకు కొరవడి భద్రత ....
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో పలు కర్మాగారాల ఏర్పాటుతో ఇండస్ట్రీయల్ హబుగా మారిందని చెప్పుకోవచ్చు.దీనిలో ప్రధానంగా సిమెంట్,కెమికల్ కర్మాగారాలే ఎక్కువ అని తెలుస్తుంది.ఈ ప్రాంతం రాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా మరియు గేట్ వే గా పారిశ్రామికవేత్తల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది ముఖ్య భాగం పోషిస్తుందని చెప్పుకోవచ్చు.దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగ్గయ్యపేట ప్రాంతం ఇండస్ట్రీయల్ హబుగా,ఈ ప్రాంతం నుండి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వనరుగాను,ఎంప్లాయిమెంట్ సమస్యలను తీరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.కర్మాగారాలు ఏర్పాటు చేసిన ప్రాంతం కన్న కర్మాగారాలు లేని ప్రాంతం కన్న కాలుష్యం ఎక్కువనే చెప్పుకోవచ్చు.
జగ్గయ్యపేట పలు ప్రాంతాలలో కర్మాగారాలు కాలుష్యాని వెదజల్లుతున్నాయని కొందరు ఆందోళనలు చేస్తున్నారు.మరో పక్క కర్మాగారాలను అధికారులు సైతం ఇబ్బందులను గురిచేసారనే ఆరోపణలతో కర్మాగార యజమాని తీసివేయాలనే విషయాలు బహిర్గతం అవ్వడం,స్థానిక నాయకులు సైతం యాజమాన్యానికి నచ్చచెప్పిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.కర్మాగారాల యాజమాన్యానికి ప్రభుత్వ పరిరక్షణని అందించకపోవడం,కాలుష్యం పై కొందరు చేస్తున్న ఆందోళన నడుమ ఇప్పటికే ఉన్న కర్మాగారాలు భయాందోళనలతో రాష్ట్రం తరలి వెళ్ళిపోతున్నాయని,కొత్త పెట్టుబడుదారులు జగ్గయ్యపేట ప్రాంతంలో కర్మాగారాల యజమానులు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.దీనితో కర్మాగారాల మూతబడటంతో ఉద్యోగాలు గాలిలో ఆవిరి అవుతుంటే,మరో పక్క నూతన కర్మాగారాలు రాకపోవడంతో కొత్త ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళుతుంటే ఇది ఎవ్వరి తప్పిదం అనే అభిప్రాయాలు యువతలో తలెత్తుతున్నాయి.
స్దానికంగా ఏ పార్టీ నాయకులైన ఓటు బ్యాంకు కోసం గో ... పి లు గా ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.దీనితో కాలుష్యం కాస్త కర్మాగారాల మూతలకు శాపంగా మారబోతుంటే,వీటిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఉరి తాడు గా మారబోతుందనే అభిప్రాయాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.ఇది చాలదనట్లు పాచ్యత దేశల మధ్య యుద్ధం,ప్రభుత్వ పన్నులు,ఫెనాల్టీలు కాస్త మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు గా ఉంది ప్రభుత్వ తీరు.కూటమి ప్రభుత్వం పెట్టుబడులు కోసం ఇతర దేశాలకు వెళ్ళి ఇండస్ట్రీలను ఆహ్వానిస్తుంటే, జగ్గయ్యపేట ప్రాంతంలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితుల నడుమ ఇతర ప్రాంతాలకు తరలి పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.జగ్గయ్యపేట కాలుష్యమా లేక కర్మాగారాలను తరలించాలా అనేది ప్రభుత్వమే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0