G.O. 396 వల్ల రాష్ట్రంలో 5 లక్షల దస్తావేజు లేఖరుల కుటుంబాలు రోడ్డుపాలు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి
G.O. 396 వల్ల రాష్ట్రంలో 5 లక్షల దస్తావేజు లేఖరుల కుటుంబాలు రోడ్డుపాలు
ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఆందోళన
జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిఓ నెం 396 కు వ్యతిరేకంగా ది:20/07/2026 నుండి ఆందోళన పిలుపు మేరకు పెన్ డౌన్ లో భాగంగా జగ్గయ్యపేట ప్రాంతంలో సుమారు 200 దస్తావేజు లేఖరులు,దాని పై ఆధారపడిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగ్గారు.ఈ సందర్భంగా జగ్గయ్యపేట దస్తావేజు సంఘం అధ్యక్షులు మాడపాటి కిశోర్ బాబు,మరువాడ ఉమా మహేశ్వరావు,జి రమేష్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరంతరం ప్రభుత్వానికి ఆదాయం కల్పించేలాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో భాగంగా దస్తావేజు లేఖరులు,స్టాంప్ వెండర్స్,డిటిపి ఆపరేటర్లు,హెల్పర్స్,జిరాక్స్ మిషన్లు,ఫోటోలు,ప్రైవేటు సర్వేయర్స్ సుమారు 5లక్షలు మంది ఆధారపడి కుటుంబ పోషణని కొనసాగుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద జిఓ నెం 396 ని తీసుకొని వచ్చి ఈ రంగాని ప్రైవేటు పరం చేయాలని చూస్తుందన్ని వారు అన్నారు.దీని వల్ల సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థ అస్తవ్యస్తంగా కావడమే కాకుండా దస్తావేజు లేఖరులు దాని పై ఆధారపడి జీవిస్తున్న వారి జీవన భృతి ని కోల్పోతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసిన జిఓ నెం 396 ని రద్దు చేసి, దస్తావేజు లేఖరులు దాని పై ఆధారపడిన వారికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న లేఖర్లు ప్రభుత్వాని కోరుతున్నారు.ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ సిపి కాంగ్రెస్,సిపియం పార్టీ ఇప్పటికే మద్దతు తెలియజేసారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0