సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై సూర్య శ్రీనివాస్, ఎస్ఐ సాయి మణికంఠ

బండి పాలెం స్టూడియో భారత్ పత్రినిధి

Jan 11, 2026 - 12:25
 0  27
సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై సూర్య శ్రీనివాస్, ఎస్ఐ సాయి మణికంఠ

సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై సూర్య శ్రీనివాస్, ఎస్ఐ సాయి మణికంఠ. 

పరిధి ఏదైనా ప్రాణాలను కాపాడిన ఎస్సైలను అభినందించాల్సిందే.

హ్యాట్సాఫ్ ఎస్సై .సూర్య శ్రీనివాస్ , ఎస్సై 2,సాయి మణికంఠ

మానవత్వం మంటగలిపే ఈ రోజుల్లో విధి నిర్వహణలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెను వెంటనే చిల్లకల్లు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్సై సూర్య శ్రీనివాస్ ,ఎస్ఐ2 సాయి మణికంఠ హుటా హుటిన జగ్గయ్యపేట మండలం బండిపాలెం, పెనుగంచిప్రోలు మండలం కో నకంచి గ్రామాల మధ్య జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి నీటిలో పడిపోయినటువంటి కుటుంబ సభ్యులను బయటకు తీసి ఓ వ్యక్తి ప్రాణాపాయంగా ఉండటం , వ్యక్తి ఇబ్బంది పడటం చేత ఇద్దరు ఆ వ్యక్తులకు సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడి మెరుగైన వైద్యం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజంగా ఖాకీ అంటే కర్కశం ఉంటది అనుకున్నాం .కానీ కాకి అంటే కల్మషం లేని కొందరు అధికారులుఉంటారనేది ఇప్పుడు ఎస్సై సూర్య శ్రీనివాసును ఎస్ఐ సాయి మణికంఠను చూసి తెలుసుకున్నామనిప్రజలు వారిని అభినందించారు. వీరితో పాటు హోంగార్డు అప్పారావు, మరి కొద్ది మంది పోలీస్ సిబ్బంది గ్రామస్తులు ఎస్సై సూర్య శ్రీనివాస్ కు ,ఎస్ఐ సాయమణికంఠకు సహకరించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news