చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకతీయ కమ్మ సేవ సమితి సౌజన్యంతో ఉచిత వస్తువుల పంపిణీ

జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి

Jan 26, 2026 - 10:58
 0  104
చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకతీయ కమ్మ సేవ సమితి సౌజన్యంతో ఉచిత వస్తువుల పంపిణీ

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకతీయ కమ్మ సేవ సమితి సౌజన్యంతో ఉచిత వస్తువుల పంపిణీ 

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణంలో గల శుభమస్తు కళ్యాణ మండపంలో చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమెరికా యన్.ఆర్.ఐ వెనిగళ రవికుమార్ రేణుకా దంపతుల ఆధ్వర్యంలో కాకతీయ కమ్మ సేవ సమితి సౌజన్యంతో సుమారు 5 లక్షల రూపాయల విలువ తో కూడిన వస్తువులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.దీనిలో భాగంగా 20 మంది వీధి చిరు వ్యాపారులకు తోపుబండ్లను,6 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు,వెడ్ గ్రైండర్లను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా స్థానిక శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్,మాజీ మంత్రి వర్యులు,కెడిసిసి బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం,నెట్టెం శివరాం,బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మన్నే శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెనిగళ రవికుమార్ రేణుకా దంపతులు చేస్తున్న సేవను కొనియాడారు.అనంతరం పేదలకు తోపుడు బండ్లను,కుట్టు మిషన్లు,వెడ్ గ్రైండర్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెనిగళ రవికుమార్ రేణుకా దంపతులు మాట్లాడుతూ చేతన ఫౌండేషన్ ని 2016 ప్రారంభించడం జరిగింది.భారత దేశంలో పేద వర్గాల కోసం ఆకలి తీర్చడం,విద్యార్థుల సహకారం అందించడం జరుగుతుంది.ఉపాధి కోసం చేయూత నందించడం,ప్రకృతి వైపరీత్యాల లో ఆదుకోవడం జరుగుతుందన్నారు.

ఇప్పటి వరకు భారత దేశంలో చేతన ఫౌండేషన్ నుండి సుమారు 1,14,000 మంది పేద చిరు వ్యాపారులను ఆదుకోవడం జరిగింది.లక్షల స్కూల్ బ్యాగ్లు,యాబై లక్షల శానిటరీ ప్యాడ్స్ ఇంకా పలు సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్మ సేవ సమితి అధ్యక్షులు కొల్లి స్టాలిన్, కార్యదర్శి బొజ్జా రాజేష్,మహిళా విభాగం అధ్యక్షురాలు కనపర్తి పద్మజా,కార్యదర్శి సూరమనేని శైలజా,కాకతీయ కమ్మ సేవ సమితి మాజీ అధ్యక్షులు కనపర్తి వెంకటేశ్వర్లు,కళ్యాణం కోటేశ్వరరావు,ఇంటూరి రంగనాయకులు,కళ్యాణం కృష్ణా రావు, చెరుకూరి రమేష్,మద్దుకూరి రాంబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news