ఎల్‌.ని.నో ప్రభావంతో వర్షపాతంలో భారీ లోటు-రైతులకు పెరుగుతున్న సాగునీటి భారం

జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి

Sep 5, 2026 - 18:04
 0  47
ఎల్‌.ని.నో ప్రభావంతో వర్షపాతంలో భారీ లోటు-రైతులకు పెరుగుతున్న సాగునీటి భారం

ఎల్‌.ని.నో ప్రభావంతో వర్షపాతంలో భారీ లోటు-రైతులకు పెరుగుతున్న సాగునీటి భారం

జగ్గయ్యపేట

వర్షాలు కురుస్తాయని ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతులకు ఈ ఏడాది ఎల్.ని.నో ప్రభావం మూలానా వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.ఎల్‌.ని.నో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్‌ నుంచి ఆగస్టు 2025 వరకు జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాధారణ వర్షపాతం 550 మి.మీ. కాగా, కేవలం 263.3 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో ఏకంగా 52.1 శాతం లోటు ఏర్పడింది.జూన్‌ లో సాధారణం కంటే 19.3 శాతం అధికంగా వర్షపాతం నమోదైనా..

జూలైలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణంగా 219.3 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 20.4 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే 90.7 శాతం లోటు ఏర్పడింది. ఆగస్టులోనూ సాధారణం 230.6 మి.మీ. కాగా, 123.5 మి.మీ. మాత్రమే నమోదై 46.4 శాతం లోటు నమోదైంది.వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా రైతులు పంటల సాగును కొనసాగిస్తున్నారు.

అందుబాటులో ఉన్న 2026 పంటల గణాంకాల ప్రకారం జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో కలిపి 42000 ఎకరాలలో పంటలు సాగు అవుతుంగా.ఇందులో పత్తి 18000, వరి 16000 , మిరప 5800 ఎకరాలలో పంట సాగు ప్రధాన పంటలుగా ఉన్నాయి.వర్షపాతం లోటు కొనసాగితే వర్షాధార పంటలతో పాటు బోర్లు, చెరువులు, ఇతర సాగునీటి వనరులపై ఆధారపడే రైతులపై అదనపు భారం పడే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే వర్షాల మధ్య విరామం పెరగడంతో పంటలకు అవసరమైన తేమ, నీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చెరువుల్లో నీటి నిల్వలు పెంచడం , వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాల సంరక్షణ, సాగునీటి వనరులను బలోపేతం చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. వర్షం కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సద్వినియోగం చేసుకునే విధానాల వైపు వ్యవసాయాన్ని మళ్లించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పంట నష్టపోతున్న రైతులను,వ్యవసాయం పై ఆధారపడి బ్రతుకుతున్న గ్రామీణ వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.✍️మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news