పెండింగ్‌లో ఉన్న ఎన్‌టీఆర్ ఆరోగ్య భృతి, ఆసరా నగదును వెంటనే చెల్లించాలి: సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి
పెండింగ్‌లో ఉన్న ఎన్‌టీఆర్ ఆరోగ్య భృతి, ఆసరా నగదును వెంటనే చెల్లించాలి: సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు
జగ్గయ్యపేట, జూన్ 14:
జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు పొందిన రోగులకు బకాయిగా ఉన్న ఎన్‌టీఆర్ ఆరోగ్య భృతి,ఆసరా నగదును వెంటనే విడుదల చేయాలని సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలలో 2024 ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు డెలివరీలు, చిన్నపాటి అత్యవసర చికిత్సలు తదితర వైద్య సేవలను సుమారు 2,000 మంది రోగులు పొందినట్లు తెలిపారు. వీరిలో అనేక మంది ఎన్‌టీఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆరోగ్య భృతి, ఆసరా పథకాల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు వారికి రావాల్సిన నగదు అందలేదని పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అందాల్సిన ఆర్థిక సహాయం కోసం నెలల తరబడి, కొందరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య భృతి, ఆసరా నగదు ఆలస్యం కావడం వల్ల చికిత్స అనంతర ఖర్చులను భరించడంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి,పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆరోగ్య భృతి, ఆసరా నగదును విడుదల చేయాలని మెటికల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ అంశాన్ని అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వ పెద్దలను కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
1
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0