అక్రమ రవాణాలకు నెంబర్ ప్లేట్ లేకపోయిన వాహనాలను అధికారులు పట్టించుకోరు.....
జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి
అక్రమ రవాణాలకు నెంబర్ ప్లేట్ లేకపోయిన వాహనాలను అధికారులు పట్టించుకోరు.....
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు టోల్ గేట్ దాటుతున్న టోల్ గేట్ వారికి అవసరం లేదు....
ఏమైన యాక్సిడెంట్స్ అయితే మాత్రం వాహనాల నెంబర్ ప్లేట్ గుర్తించే నాధుడెవ్వరు....
గుర్తు తెలవని వాహనంగా మాత్రం కొన్ని కేసులల్లో పోలీసు రికార్డులో నమోదౌతున్నట్లు సమాచారం..
చిల్లకల్లు
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో గల టోల్ గేట్ వద్ద నెంబర్ ప్లేట్ లేని టిప్పర్ హోండై కారు వెనుక భాగంలో ఎడమ వైపు సిగ్నల్ లైట్ ను తగ్గలటం లో త్రుటిలో తప్పిన ప్రమాదం.కారు కు మాత్రం డ్యామేజ్ అయింది.ఈ సంఘటనలు జగ్గయ్యపేట ప్రాంతంలో పరిపాటిగ మారిందనే చెప్పుకోవచ్చు.జగ్గయ్యపేట ప్రాంతంలో అక్రమ రవాణాలు నడిపే టిప్పర్లకు నెంబర్ ప్లేట్లు లేకపోయిన రవాణా,పోలీసు శాఖలు పట్టించుకోకపోవడం మూలానా ప్రమాదాలు జరిగినప్పుడల్ల వాహనాలను గుర్తించలేని పరిస్థితులు నెలకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
పోలీసులు మాత్రం నిరంతరం టోల్ గేట్ వద్ద ద్విచక్ర వాహనాల వారికి టోల్ గేట్ వద్ద అవగాహన కల్పించడం,రవాణా శాఖ మాత్రం తనిఖీలు చేస్తున్నారే తప్ప నేషనల్ హైవే పై అక్రమ రవాణా,ఓవర్ లోడ్,నెంబర్ ప్లేట్ లు,కాగితాలు ఫోర్స్ లో లేని,బార్డర్ అనుతులు,కాలం చెల్లిన వాహనాల పై నిఘాలను చేయకపోవడం పట్ల ప్రజల నుండి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో వాహనాలు నిబంధనలను పాటించకుండా రాష్ట్ర సరిహద్దు దాటుతున్న టోల్ గేట్ వద్ద,హైవే పై,పలు సర్వీస్ రోడ్డులలో సిసి కెమెరాలున్నప్పటికి అవి మాత్రం మౌనంగా చూస్తున్నాయే తప్ప సంబందిత అధికారుల కెమోరాలకు క్లిక్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి నెంబర్ ప్లేట్లు లేని వాహనలను,ప్రభుత్వ నిబంధనలను పాటించని వాహనాలను పట్టుకొని సీజ్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0