లారీ బోల్తాతో బొగ్గు పొడి రవాణా నాణ్యత పై పలు అనుమానాలు
బోనకల్ స్టూడియో భారత్ పత్రినిధి
లారీ బోల్తాతో బొగ్గు పొడి రవాణా నాణ్యత పై పలు అనుమానాలు
యన్.టి.ఆర్ జిల్లా వత్సవాయి మండలం సరిహద్దు శివారు ప్రాంతంలో గల తెలంగాణ రాష్ట్రం బోనకల్ రోడ్డు లో భారీ బొగ్గు పొడితో కూడిన లారీ బోల్తాతో వెలుగు చూస్తున్న అక్రమాల వెనుక దాగి ఉన్న నిజాలు...
ఈ బొగ్గు పొడిని ఇతర దేశాల నుంచి పలు ప్రధాన సిమెంట్ కంపెనీల వారు గంగవరం పోర్టు,సి పోర్టు నుండి సిమెంట్ నాణ్యత కోసం దిగుమతి చేసుకుని అక్కడ నుండి ఆర్డర్ పెట్టుకొన్న సిమెంట్ కంపెనీల వారు రోడ్డు రవాణా లారీ ల ద్వారా ఆయా కంపెనీలకు తరలించడం పరిపాటి....
దీనిని పోర్ట్ లాండ్ పోజోలన సిమెంట్ తయారీ లో వాడే క్లింకర్,జిప్స్ంతో కలిపి సిమెంట్ బ్లెండింగ్ యూనిట్ ద్వారా నాణ్యమైన సిమెంట్ తయారీలో ఉపయోగిస్తారని తెలుస్తుంది.దీనితో పాటు రెడీమిక్స్ తయారీలో మిశ్రమ పదార్థంగా వాడటం జరుగుతుంది....
దీని నాణ్యతను ఎలా నిర్ణయిస్తారంటే...
భారత ప్రమాణం IS 3812 (Part 1) ప్రకారం పరీక్షలు చేస్తారు.కంప్రెసివ్ స్ట్రెంగ్త్ పరీక్షల ద్వారా సిమెంట్ నాణ్యతను నిర్ధారిస్తారు.సిమెంట్ తయారీ లో నాణ్యత పట్ల ఇన్ని పరీక్షలు జరుగుతున్న ,సిమెంట్ కర్మాగారాలను కళ్ళు గప్పి కొందరు వ్యక్తులు ఆయా కర్మాగారాల ఒప్పంద రవాణా వారు దొడ్డిదారిన ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న నాణ్యమైన బొగ్గు పొడి లో కల్తీకి పాల్పడుతున్నట్లుగా లారీ బోల్తా ద్వారా తేటతెల్లం అవుతుంది....
సిమెంట్ కర్మాగారాలలో బొగ్గు పొడి నాణ్యత పరీశీలన కేంద్రాలు,వాటిలో పనిచేసే సిబ్బంది వైఫల్యాల మూలాన కర్మాగారలకు చెడ్డ పేరు తీసుకొస్తుందని మేధావులు భావిస్తున్నారు.ఇప్పటికైన బొగ్గు పొడి రవాణాలో జరుగుతున్న అక్రమాలను సిమెంట్ కర్మాగారాలు నివారించి,నాణ్యమైన సిమెంట్ ని ప్రజలకు అందించే చర్యలు చేపట్టేన వేచి చూడాల్సి ఉంది...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0