పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడానికి - పెరుగుతున్న స్వార్థమా - కొరవడుతున్న చిత్తశుద్ధేనా ఏది కారణం
స్టూడియో భారత్ పత్రినిధి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడానికి
పెరుగుతున్న స్వార్థమా - కొరవడుతున్న చిత్తశుద్ధేనా ఏది కారణం
46 సంవత్సరాల దాటుతున్న పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని ప్రాజెక్ట్...
విశ్లేషణాత్మక కథనం:-
పోలవరం ప్రాజెక్ట్ ని 1980 సంవత్సరంలో సుమారు 10 వేల కోట్ల రూపాయల అంచనా ఖర్చుతో ఇందిరా గాంధీ ప్రారంభించారు.తరువాత దీని పనులను వైయస్ రాజశేఖరరెడ్డి కాలంలో 2004 తరువాత పనులను వేగవంతం చేయడం జరిగింది.ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లు కూడా రివర్స్ టెండరింగ్ ల పేర్లతో పనులను పోటీ పడి చేయిస్తున్నారు.
దీనితో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాల వ్యయం సుమారు 55 వేల కోట్ల కు చేరుకుంది.ఈ ప్రాజెక్టు వల్ల సాగు, త్రాగు నీరు,విద్యుత్ ఉత్పత్తి భారీ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి మరింత జీవం ఇస్తుందని మేధావులు భావిస్తున్నారు.కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నూతన ఆర్థిక విధానాలలో పాలన పరమైన నాయకుల స్వార్థ రాజకీయాలను తేటతెల్లం చేస్తుందనే వాదనలు లేకపోలేదు.46 సంవత్సరాలు పూర్తి అయిన ప్రజలకు పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి రాకపోవడమేనని దీనికి ప్రధాన కారణమని అర్థం చేసుకోవచ్చు.
పోలవరం పూర్తి చేయకపోగా ప్రభుత్వాలు ఎన్ని సాకులు,ఒక్కరి పై ఒక్కరు విమర్శలు గుప్పించుకున్న అది ప్రజలకు పాలనలో ఉన్న పెద్దలు ఏ సమాధానం చెప్పుకుంటారోననే వాదనలు సైతం వినిపిస్తుంది.ఇప్పటికే స్వాతంత్ర్యం అనంతరం రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులలో నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టులు సుమారు 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలలోపు పూర్తి అయి రాష్ట్రాని సశ్యామలం దిశగా ఈ ప్రాజెక్టు లు తీసుకెళ్ళాయి.పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులాగా ఒక్కే కోవకు చెందిన దేశంలో భాక్రా నంగల్,హీరాకుడ్,టెహ్రీ,సర్దార్ సరోవర్ పూర్తి చేసుకొని దేశ జాతీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో ఇప్పటి వరకు పాలించిన,ప్రస్తుతం పాలిస్తున్న పార్టీల వైఫల్యాలు వారి చిత్తశుద్ధి లోపించిందనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.ఇటువంటి తీరు మార్చకోకపోతే రాష్ట్రాని పాలించే పార్టీల నాయకులు పోలవరం లాంటి ప్రాజెక్టుకు శాపంగా మారుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.ఇప్పటికైన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో నడుచుకొని,స్వార్థ రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసి రాష్ట్ర కీర్తీ ప్రతిష్టలను కాపాడే దిశగా ఆలోచనలు చేస్తే బాగుంటుందని ప్రజలు రాజకీయ పార్టీల నాయకులను కోరుకుంటున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0