3 వేల కోట్ల విలువైన భూమి హైడ్రా స్వాధీనం?
హైదరాబాద్ స్టూడియో భారత్ పత్రినిధి
3 వేల కోట్ల విలువైన భూమి హైడ్రా స్వాధీనం?
హైదరాబాద్:
హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది, అక్కడ అక్రమ కట్టడాలు తొలగించింది చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది, ఈ భూమి విలువ దాదాపు 3వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, మండలం మియాపూర్, పరిధిలోని మక్తా మహబూబ్ పేట, గ్రామ సర్వేనెంబర్ 44 లో ప్రభుత్వ భూమి అక్రమణా లకు గురవుతుందని హైడ్రాకు గతంలో ఫిర్యాదు వచ్చింది, ఈ ఫిర్యాదు మేరకు గతేడాది డిసెంబర్ 8న 5 ఎకరాల మేర ఉన్న అక్రమణలను హైడ్రా తొలగించింది,
తాజాగా హద్దులను నిర్ణయించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. తప్పుడు సర్వే నెంబర్లతో కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది.హైదరాబాద్ నగరంలో మరోసారి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. కబ్జా కోరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడింది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఇది.
కబ్జాలకు గురైన రోడ్లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై హైడ్రా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేశారంటే చాలు.. హైడ్రా వెంటనే యాక్షన్ లోకి దిగిపోతోంది. కొన్ని అంశా ల్లో కోర్టు కేసులు ఉన్నా హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా కబ్జాలు జరిగాయ ని, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిస్తే చాలు.. హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. కబ్జాకు గురైనా భూములను స్వాధీనం చేసుకుంటోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0