యుద్ధాలతో ప్రజల భవిష్యత్తునే తాకట్టు పెడుతున్న అమెరికా
అమెరికా స్టూడియో భారత్ పత్రినిధి
యుద్ధాలతో తన ప్రజల భవిష్యత్తునే తాకట్టు పెడుతున్న అమెరికా
పెద్దన్న పాత్ర పోషించాలి - పొట్లాడడం మద్యే మార్గం కాదు
మధ్య ప్రాచ్యం – 50 ఏళ్ల వైఫల్యాల తుది విశ్లేషణ
ప్రపంచానికి శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు నేర్పే దేశంగా తనను తాను ప్రచారం చేసుకునే యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా, వాస్తవంగా గత ఐదు దశాబ్దాలుగా అమలు చేస్తున్న విదేశాంగ విధానాలు మాత్రం ప్రపంచ అస్థిరతకు, అమెరికా ప్రజల భద్రత, సంక్షేమానికి కూడా పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
కొన్ని సంవత్సరాల నుండి పరిశీలన తరువాత నేనెరిగిన సత్యం. ఇది ఇప్పుడు నా అభిప్రాయం కాదు. ఇది చరిత్ర పుటల్లో వచ్చిన వాదనలే నేను రాసిన ఈ వ్యాసం. చరిత్ర గతుల్లో దాగిన చారిత్రత్మాక విషయాలు బావి తరాల కోసం మీ ముందు ఉంచుతున్నాను. క్యూబాలో ఎన్నో ఆంక్షలు విధించి ప్రజాస్వామ్యం పేరుతో యుద్దం చేసిన అమెరికా అక్కడ ప్రజలలో నుండి ద్వేష బావమే పెంచుకుంది తప్ప ఆరాధన బావమేమి లేదు. పైగా అమెరికా చేసిన ఈ సైనిక చర్య వల్ల అక్కడి ప్రజలు ఏకికృతం అయ్యారు. క్యూబా పై అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలు 1960 నుంచి ఇప్పటికి కొనసాగుతున్న ఆ దేశం అవేమి వాటిని పట్టించుకోలేదు. అమెరికా అనుకున్నది ఏమిటంటే క్యూబాలో కమ్యూనిస్టు పాలన కూల్చివేత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ముందుకు పోయినప్పటికీ, 60 ఏళ్ల తర్వాత సైతం అక్కడ పాలన మారలేదు, వ్యవస్థ కూలలేదు
ప్రజాస్వామ్యం రాలేదు, పైగా వారి ఆర్ధిక వ్యవస్థ స్వతాగ బలం పడింది. అమెరికా చేసిన ఈ యుద్దం ఎవరి కోసం...ఎందుకోసం..., యుద్దం వల్ల నష్టపోయింది ఎవరు? క్యూబా సాధారణ ప్రజల మరణాలు, ఇరు వర్గాల సైనికుల బలగాలు, కాగా ముందు చూపు లేకుండా అమెరికా పాల్పడిన అనైతిక ఆంక్షలు, యుద్ధం అమెరికా విశ్వసనీయతను దెబ్బ కొట్టాయి.ఒక చిన్న దేశాన్ని మార్చలేకపోతే, అవి ఏపాటి శిక్షా విధానాలో, ప్రతీకార రాజకీయాలో? ఒక్కసారి ప్రపంచం ఆలోచించాలి.
అమెరికా పక్కన ఉన్న వియత్నాం కమ్యూనిస్ట్ దేశంగా సూపర్ పవర్ అవుతుందని, వియత్నంపై అమెరికా చేసిన యుద్ధం అహంకారానికి పెట్టిన చరిత్రాత్మక తప్పిదం అయింది. కమ్యూనిజం వ్యాప్తి ఆపాలని ప్రపంచం చూస్తుందని చెపుతున్న అమెరికా ఇప్పటికి కోటి మంది పౌరుల మరణాలు, 58 వేలకు పైగా అమెరికన్ సైనికుల మృతికి కారణం అయిందనే ఆరోపణలు నేటికి ఉన్నాయి. ఇది అమెరికాతో పాటు ప్రపంచ సమాజంలో తీవ్రమైన మానసిక గాయంగా చెప్పొచ్చు. చివరికి అమెరికా ఈ రెండు చిన్న కమ్యూనిస్ట్ దేశాల దాటికి తట్టుకోలేక తోక ముడిచి వెనుదిరిగిపోయే పరిస్థితి వచ్చింది. అయిన ఆ పాఠాన్ని అమెరికా ఒంట పట్టించుకోలేదు. ఫలితంగా క్యూబా, వియత్నాం దేశాలు ఇప్పటికి ప్రజలలో బలమైన కమ్యూనిస్ట్ రాజ్యాలు అయ్యాయి. ఈ రెండు యుద్దాలు అమెరికా మేదో సంపత్తితో చేసినవి కావు. కేవలం సైనిక శక్తిని నమ్ముకొని, అనాలోచితంగా చేసిన ద్వంద విధానామని అమెరికా తెలుసుకొని, అంతిమ పరిష్కారం గుర్తెరగాలి.
అమెరికా యుద్దాలు - ఫలితం శూన్యం
క్యూబా, వియత్నం తరువాత గడిచిన 20 ఏళ్ల తాలిబాన్ అంతర్గత యుద్దం, అమెరికా సహాయం అధికారం మార్పు, ఆ యుద్ధం తరువాత అమెరికా దళాల వెంట తాలిబాన్లు, అక్కడ పౌరులు అమెరికా మిత్ర కూటమి దళాలను తరిమి, వారి ఆయుధ, వైమానిక సంపదను దక్కించుకొని తిరిగి తాలిబాన్లే అధికారంలో వచ్చారు. ఇది ఒక చిన్న వైరి దేశంలో అమెరికా ఫెయిల్యూర్ స్టోరీ. ఒకప్పుడు అమెరికా గల్ఫ్ వార్ పేరుతో 1991 లో యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ అధ్యక్షులుగా ప్రకటించి, ఇరాక్ ని మిత్ర దేశం చేసుకుంది. 2011లో అదే ఇరాక్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్ మీద అనూహ్య డాడీకి అమెరికా దిగింది. జీవ, రసాయన ఆయుధాలు ఉన్నాయని అబద్ధపు కారణాలతో ఆ దేశం మీద యుద్దం ప్రకటించి, ఆదేశ అధ్యక్షుడైన సద్దాం హుస్సేన్ యుద్ధ ఖైదు చేసి ఉరికంభం ఎక్కించింది. ఆ దాడితో దేశం నేటికీ అస్థిరత్వం పోయిందా?... అంటే లేనే లేదు. అక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చర్యలు మారలేదు. అంతర్గత భద్రత అదే స్థితిలో ఉంది. 2011లో నాటో దళాలతో అమెరికా లిబియాను దేశం టార్గెట్ చేసింది. ఆ దేశ అధ్యక్షులు గాడఫీని కిరాతకం అయిన నియంతగా అమెరికా ప్రచారం చేసి సైనిక చర్య జరిపి గాడఫీ కుటుంబం మొత్తాన్నే చంపించింది. ప్రస్తుతం ఆ దేశం శాంతి, సుస్థిరత లేకుండా పోయింది, దేశం ముక్కలైంది. అమెరికా యుద్ధం చేసిన ప్రతిచోటా ప్రజాస్వామ్యం విఫలం, ఉగ్రవాదం పెరుగుదల, శరణార్థుల సంక్షోభం, ఎన్నో వైఫల్యాలు మూట గట్టుకున్న అమెరికా వాటిని విజయాలుగా ఎలా బావిస్తుందో అర్ధం కానీ ప్రశ్న?
అమెరికా 50 ఏళ్ల ఏక పక్ష, ద్వంద యుద్ధ విధానాలవల్ల ప్రపంచం ఎన్నో రకాలుగా మూల్యం చెల్లిస్తుంది. అదే కాకుండా అక్కడ ప్రజలపై మోపిన పెను భారము ఎంతో ఉన్న అమెరికా ఇది దాచి పెట్టే ప్రయత్నం చేస్తునే ఉంది. ఈ ప్రాపంచిక యుద్ధాల వల్ల అమెరికా యుద్ధ బాధిత దేశాల ప్రజలతోపాటు అమెరికా ప్రజలు ఎక్కువ మూల్యం చెల్లిస్తునేఉన్నారు. ట్రిలియన్ల డాలర్ల యుద్ధ వ్యయం వల్ల అక్కడ ప్రజల సంక్షేమాలైన ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలపై భారం పడుతుంది. అమెరికాలో లక్షల మంది వెటరన్లు సమస్యలతో, సంక్షోభంతో జీవనం సాగిస్తున్నారు. ఆర్ధిక లేమి వల్ల మాధ్యమిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. పైగా ఈ యుద్ధాల వల్ల ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమెరికా ప్రజలకు భద్రత ముప్పు వెంటాడుతుంది. విదేశీ యుద్ధాలే ఈ దేశీయ అ భద్రతకు మూలమా?..., అమెరికా చేపట్టిన యుద్ధాలే ఆయా కొన్ని దేశాల్లో అంతర్జాతీయ ఉగ్రవాద ప్రతీకారానికి కారణమయ్యాయన్న వాదనలు సైతం ఉన్నాయి. అమెరికా నగరాలపై, వ్యక్తులపై దాడులకు ప్రేరణ అయ్యాయన్న ఆరోపణలు ఇంకా బలపడుతున్నాయి. ఇతర దేశంలో భద్రత కోసం మొదలైన ఈ అమెరికా యుద్ధాలే ఆ దేశంలో అసురక్షిత భావాన్ని పెంచాయి. ఇది విధానపరమైన విపత్తు కాదా...? అని అమెరికా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అంతర్జాతీయ న్యాయ సూత్రాల పట్ల అమెరికా విముఖత
ప్రపంచానికి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్నా, ఐక్యరాజ్య సమితి ఉన్న సరే అమెరికా ఎందుకో వాటితో పూర్తి విధేయత చూపదు, తన సైనిక చర్యలకు పర్యవేక్షణ అంగీకరించదు, న్యాయం అందరికీ సమానమైతే, ఐక్యరాజ్య సమితి సైతం అమెరికాకు ఎందుకు మినహాయింపు ఇస్తుందో? బలహీనమైన దేశాలకు అండగా ఉండాల్సిన ఐక్యరాజ్యాసమితి, పెట్టుబడి, సామ్రాజ్య వాద దేశాల పట్ల ఉదాసీనంగా ఉంటుందని బహిరంగ విమర్శలు ఎదుర్కొంటుంది.ఈ తంతు ఇలా కొనసాగితే భవిష్యత్ లో అంతర్జాతీయంగా ఆయా దేశాలకు ముప్పు ఎలా ఉంటుందో...? పలు దేశాలకు ఐక్యరాజ్య సమితి వారు ఏ సమాధానం చెపుతుందో వేచి చూడాలి.అమెరికా దాని మిత్ర దేశాలు, ఇతర విద్రోహ దేశాలు ఏమి చేస్తున్న ప్రపంచం ప్రస్తుతం మౌనంగా ఉందని అనుకోవడం పొరపాటు.అమెరికా యుద్ధ విధానాలపై ప్రపంచ వ్యతిరేకత మొదలైతే ఇది పెద్ద సంక్షోభమే...?, సవాల్ - కా - జవాబు అనే రీతిలో అమెరికేతరా కొత్త అంతర్జాతీయ కూటములు నెలకొల్పితే, అమెరికా మిత్ర దేశాల సైనిక ఆధిపత్యానికి సవాళ్లుగా మరే అవకాశం ఉంది. ఈ నేపథ్యం కొనసాగితే ప్రపంచంలో అమెరికా ఒంటరి అయ్యే ప్రమాదం దగ్గరలో ఉంటుంది.అమెరికా దాని మిత్ర దేశాలు ఏక పక్ష సైనిక చర్యలు, ఇతర దేశాల్లోని అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడం, వారి ఆర్ధిక మూలలపై కన్ను వేయడం, ఉద్దేశ్యపూర్వక ఆంక్షలు వేయడం, ఇబ్బడి, మబ్బిడిగా ఆయుధాల అమ్మకం, ఒకప్పుడు స్నేహంగా ఉండి మళ్ళీ అదే దేశాలను శత్రు దేశాలుగా చూపడం, ఉగ్రవాదం నడుపుతున్న దేశాలకు, ప్రజాస్వామ్య, కమ్యూనిస్ట్ దేశాల మనుగడను దెబ్బ తీస్తే, అమెరికాతో పాటు ఆయా అమెరికా మిత్ర దేశాలు, వీరిని వ్యతిరేకించె దేశాలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలో అస్థిరత పెరిగి, యుద్దాల వైపు ప్రయాణిస్తే మూడో ప్రపంచ యుద్దానికి మూలం అయ్యే ప్రమాదం ఉంది.
అమెరికా యుద్ధ వైఫల్యాలు
క్యూబా నుంచి అఫ్గనిస్తాన్ (కాబూల్), వియత్నాం నుంచి లిబియా వరకు,గ్రేనేడా,ఇరాక్ (రెండు సార్లు), యుగోస్లీవియా,సిరియా, సోమాలియా, ప్రస్తుతం వినేజులలో ప్రపంచం కనుల్లో దాగి ఉన్న సత్యం.ఇదే కాకుండా పాకిస్తాన్, ఇజ్రాయిల్,సౌది అరేబియా,పిలిప్పిన్స్,ఈజీప్ట్, ఉక్రైన్ దేశాలకు ఆయుధ,సైనిక సహాయం అమెరికా చేస్తుంది.అందుకే అమెరికా గ్రహించాల్సింది ఏమిటంటే..., ఎప్పటికి యుద్ధం ప్రజాస్వామ్యం తీసుకురాదు,యుద్ధం శాంతిని ఇవ్వదు,యుద్ధం ఏ దేశ ప్రజలకు కూడా భద్రత ఇవ్వదు. ముఖ్యంగా అమెరికా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమెరికా నిజంగా ప్రపంచ నాయకత్వం కోరుకుంటే యుద్ధాన్ని త్యాజించాలి,అంతర్జాతీయ న్యాయ సూత్రాలు పాటించాలి, ఆయుధాలను కాదు, చర్చలతో ఆయా దేశాలను ముందుంచాలి,శాంతి,సుస్థిరత కోరుకోవాలి, ఆర్ధిక స్వార్థం వీడాలి,ఉద్దేశ పూర్వకంగా కాకుండా, అన్ని ప్రాపంచిక న్యాయ సూత్రాల ప్రకారం ఏదైనా చేయాలి.రాజ్య దేశాలతో స్నేహన్ని ఇప్పుడు ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు కనుక, దీనికి విరుద్ధంగా అమెరికా బావ జాలం ఉంటే భవిష్యత్తులో అతి పెద్ద ముప్పును అమెరికా,దాని మిత్ర దేశాలు ఎదుర్కొంటాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0