కాలుష్య నియంత్రణ మండలి ఉన్నట్లా లేనట్లా
స్టూడియో భారత్ పత్రినిధి
కాలుష్య నియంత్రణ మండలి ఉన్నట్లా లేనట్లా....
ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కర్మాగారాలు ఏర్పాటు వల్ల ప్రజల పైకి వెదజల్లుతున్న కాలుష్యం
జగ్గయ్యపేట ప్రాంతం కాలుష్యం డేంజర్ జోన్ లో ఉందని గుర్తించిన ప్రభుత్వం
అసలు కాలుష్యానికి గల మూలాలను కనుగొన లేని కాలుష్య నియంత్రణ మండలి
కాలుష్యం భయంతో జగ్గయ్యపేట ప్రాంత ప్రజలు
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట ప్రాంతంలో ఇప్పటికే పలు కర్మాగారాల ఏర్పాటు తో ఇండస్ట్రీయల్ గా అభివృద్ధి చెందుతుంది.జగ్గయ్యపేట ప్రాంతంలో ఇప్పటికే ఉన్న కృష్ణా నది పరివాహక ప్రాంతం వెంబడి పచ్చదనం తో కొండలు,గుట్టలు వేల ఎకరాలల్లో ప్రకృతి సిద్ధంగా విస్తరించి ఉంది.ఇప్పటికే జగ్గయ్యపేట ప్రాంతంలో సిమెంట్,కెమికల్ మరియు తదితర పొల్యూషన్ కారకాలైన కర్మాగారాలను ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది.కొన్ని కర్మాగారాలను ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఏర్పాటు చేయగా,మరి కొన్ని ప్రభుత్వ అనుమతులతో కర్మాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది.స్థానిక నాయకులు ఏ పార్టీకి చెందిన వారైన పెద్ద కర్మాగారాలలో ప్రధాన కాంట్రాక్టరులుగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.దీనితో జగ్గయ్యపేట ప్రాంతం గాలి,నీరు, దుమ్ము ధూళి కణాలు సైతం కాలుష్యం అయ్యాయని వాదనలు ప్రజల నుండి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.2018 సంవత్సరం లో గట్టేడి ప్రసాద్ బృందం,ప్రస్తుతం సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు మరియు కొందరు స్థానికులు కలసి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమావేశంలో బలంగా ఆందోళన వ్యక్తం చేయగా,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు జగ్గయ్యపేట ప్రాంతంలో గాలి, భూగర్భ జలాలు,దుమ్ము ధూళి పొల్యూషన్ అయ్యాయని నివేదిక తయారీ చేసి దీని నివారణకు చర్యలు నిమిత్తం కేంద్ర ప్రభుత్వాన్నికి పంపించడం జరిగింది.దీనితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలసి జగ్గయ్యపేట ప్రాంతం పొల్యూషన్ రెడ్ జోన్ గా ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
అప్పటి నుండి ప్రజలు జగ్గయ్యపేట ప్రాంతంలో పలు ప్రాంతాలల్లో ఆందోళన చెందుతున్నారు.కాలుష్యానికి అసలు కారణాలను నేటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కనుగొన లేకపోయిందని,ప్రజలు ఆందోళనకి ప్రభుత్వమే కారణమని,కాలుష్యానికి కారకులైన అసలు దొంగ ని పట్టుకోలేక,కర్మాగారాల యాజమాన్యాలు పొల్యూషన్ కి కారకాలుగా ప్రజల మధ్య దోషులుగా నిలబడే పరిస్థితులు నెలకొన్నాయని,దీనికి కారణం ప్రభుత్వమేనని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు,జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు ఆరోపణలు గుప్పించారు.ఇప్పటికైన ప్రభుత్వం చిత్తిశుద్ది తో కాలుష్యానికి కారకులుగా ఉన్న సిమెంట్,కెమికల్ కర్మాగారాల పై చర్యలు చేపట్టాలని,రెడ్ జోన్ లో ఉన్న జగ్గయ్యపేట ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకొని గాలి,నీరు,సహజ సిద్ధమైన కృష్ణా,పాలేరు నీటిని కాలుష్యం కోరల నుండి కాపాడి, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజి ప్రభుత్వాని డిమాండ్ చేశారు.
సంవత్సరాల తరబడి పొల్యూషన్ జగ్గయ్యపేట ప్రాంతం గాలి, నీరు, దుమ్ము ధూళి కణాలు మరింత పెరుగుతుందని,నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని,దీనితో గాలి,నీరు,భూగర్భ జలాలే కాదు,సహజ సిద్ధమైన కృష్ణా, పాలేరు వాగు నీరు సైతం కాలుష్యం అయి ఉంటాయని సిపిఐ జగ్గయ్యపేట మండలం కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు విమర్శించారు.ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు ఉన్నప్పటికి,ప్రైవేటు కర్మాగారాల యాజమాన్యం వారి ప్రైవేటు గెస్ట్ హౌస్ లో ఆతిధ్యం తీసుకోవడంతో,ప్రభుత్వ పెద్దలు కాలుష్యాన్ని ఏవిధంగా నివారణ చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1