దేశంలో వైద్య సేవలు ప్రైవేటు రంగంలో ఖరీదుగా మారింది

స్టూడియో భారత్ పత్రినిధి

Jan 16, 2026 - 00:02
 0  10
దేశంలో వైద్య సేవలు ప్రైవేటు రంగంలో ఖరీదుగా మారింది

దేశంలో అవసరమైన ప్రైవేటు వైద్య సేవలు ఖరీదుగా మారింది .

మనిషి జీవిత చక్రంలో చివరి అంకంలో అనారోగ్య పాలైతే సంపాదన మొత్తాని రక్తాని జలగలు పీల్చుతున్న మాదిరిగా ప్రైవేటు వైద్యం

ప్రజాస్వామ్యంలో ప్రైవేటు వైద్యం కోసం చిగురిస్తున్న కుటుంబాలు దోపిడికి గురి కావాల్సిందేనా...

విజయవాడ

భారత దేశం ఎప్పటి నుండో అభివృద్ధి చెందుతున్న దేశమని ప్రచారం శతాలు మారుతున్న నేటికి కొనసాగుతూనే ఉంది.దేశంలో పాలనలో ప్రశ్నించే గొంతుకలు మూగబోతున్నాయి.పాలన పగ్గాలతో గద్దె నెక్కుతున్న మహానుభావులు ప్రశ్నించడానికి ప్రతి పక్షాలు ఉండకూడదనే ఆలోచనలతో ముందుకు వెళ్ళుతున్నారు.దీనితో అటు పెద్దల సభలో ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలు లేవనే వాదనలు మేధావుల నుండి వినబడుతున్నాయి.

ప్రజా సమస్యల పై ప్రశ్నించాల్సిన ప్రచార మాధ్యమాలు సైతం వ్యక్తుల ప్రాధాన్యతను విమర్శలుగా ప్రజల ముందున్న ఉంచుతున్నారు.వాస్తవానికి మనిషికి అవసరమైన విద్యా వైద్యం పూర్తిగా ఉచితంగా ఉండాల్సింది పోయి అది కాస్తా ఖరీదుగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులలో జనాభా కనుగుణంగా ప్రభుత్వ పాఠశాలు,కళాశాలలు లేకపోవడంతో ఇదే అదునుగా కార్పోరేట్,ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలు మండల స్థాయి వరకు విస్తరించడం,ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి వారు అందిన కాడికి అధిక ఫీజులు లక్షలలో వసూలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.దీనితో ఒక్క కుటుంబం నెలవారీ ఆదాయంలో విద్య కోసం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి అప్పులు పాలౌతున్నారు.రాష్ట్రంలో సుమారు 55 వేలకి పైబడి ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో‌ సంవత్సరానికి సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.వీరి నుండి సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పైబడి విద్యార్థుల తల్లిదండ్రులు వద్ద నుండి ఫీజుల రూపంలో దండుకుంటున్నారని ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారం తెలుస్తుంది.

ఏటా తల్లిదండ్రులు కొందరి సంపాదన లో సుమారు 40 శాతం పైబడి చదువులకు ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తుంది.దీనితో చట్టానికే పరిమితం అయిన ఉచిత నిర్బంధ విద్య సైతం తుంగలో తొక్కించారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.ప్రభుత్వాలే కార్పోరేట్,ప్రైవేటు పాఠశాలలు,కళాశాలల అనుమతులు ఇచ్చి వాటి ద్వారాలు బారులు తీసి విద్యను వ్యాపారపరం చేయడంతో సామాన్య ప్రజలు పిల్లల విద్య కోసం దోపిడికి గురౌతున్నారనే వాదనలు లేకపోలేదు.ఇప్పటికైన ప్రజా స్వామ్యంలో ప్రతి విద్యార్థికి ఉచిత విద్యను అందించే దిశగా ఆలోచించాలని,విద్యార్థుల తల్లిదండ్రులు ఉచిత విద్య కోసం ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యంలో నాయకులకు బుద్ది చెప్పేలా ప్రజలు ఆలోచించాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు విశ్లేషణాత్మక కధనం ద్వారా ప్రజలకు తెలియజేసారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news