హైవే పై ప్రమాదాల నివారణకు హెల్మెంట్ తప్పని సరి - ట్రాఫిక్ యస్ఐ ఆర్ శ్రీనివాసరావు
చిల్లకల్లు స్టూడియో భారత్ పత్రినిధి
హైవే పై ప్రమాదాల నివారణకు హెల్మెంట్ తప్పని సరి - ట్రాఫిక్ యస్ఐ ఆర్ శ్రీనివాసరావు
చిల్లకల్లు
జగ్గయ్యపేట మండలం లో గల నేషనల్ హైవే 65 పై సంక్రాంతి పండుగ సందర్భంగా ద్విచక్ర వాహనాలను నడిపే వారు క్షేమంగా ఇంటికి చేరుకోవటానికి హెల్మెంట్ తప్పని సరిగ ధరించాలని ట్రాఫిక్ యస్ఐ ఆర్ శ్రీనివాసరావు వాహనదారులకు అవహన కల్పించారు.37 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా విజయవాడ సిపి వారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డిసిపి మరియు రూరల్ డిసిపి వారి ఆధ్వర్యంలో నందిగామ ఏసిపి వారి పర్యవేక్షణలో జగ్గయ్యపేట సిఐ పి.వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో సురక్షిత ప్రయాణం కోసం అవగాహన కల్పించడం జరిగిందని ట్రాఫిక్ యస్ఐ ఆర్ శ్రీనివాసరావు అన్నారు.
పండుగ సందర్భంగా ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే వారు సురక్షిత ప్రయాణం కోసం హెల్మెంట్ ని తప్పని సరిగ ధరించాలని,వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సురెన్స్,వాహనాల కాగితాలు ఫోర్స్ లో ఉంచుకోవాలన్నారు.వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని,మితిమీరిన ప్రయాణం ప్రమాదాలకు దారి తీస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏయస్ఐ ఏ శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0