ఆటో నగర్ లో చిన్న పరిశ్రమల వారికి కాలుష్య నియంత్రణ పట్ల ప్రభుత్వం భరోసా కల్పించాలి
జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి
ఆటో నగర్ లో చిన్న పరిశ్రమల వారికి కాలుష్య నియంత్రణ పట్ల ప్రభుత్వం భరోసా కల్పించాలి
డ్యామేజ్ అయిన భూగర్భ జలాలను ప్రభుత్వం రీ సైక్లింగ్ చేసి కలుషితం అయిన నీటిని మంచి నీళ్ళు గా మార్చాలి
కాలుష్యం వల్ల డ్యామేజ్ అయిన బోర్లు ఉన్న ప్లాట్ల వారికి పన్నులను పూర్తిగ రద్దు చేసి,వారిని ప్రభుత్వం ఆదుకోవాలి....
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణంలో ఆటో నగర్ ఏపిఐఐసి ద్వారా కుటీర,చిన్న,మధ్య తరహా పరిశ్రమల కోసం సుమారు 496 ప్లాట్లలను ప్రభుత్వం కేటాయించింది.దీనిలో ఆటో నగర్ లో కుటీర,చిన్న తరహా పరిశ్రమల కోసం సుమారు 323,ఇండస్ట్రీయల్ పార్క్ లో మధ్య తరహా పరిశ్రమల కోసం సుమారు 173 ప్లాట్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ 496 ప్లాట్లలో సుమారు 380 నిర్మాణాలు పూర్తి అయి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఐలా వారు డెవలప్మెంట్ కోసం అసెస్మెంట్ నెంబర్లను కేటాయించి,వారికి పన్నులను విధించడం జరుగుతుంది.31 మార్చి 2026 నాటికి ఆటోనగర్,ఇండస్ట్రీయల్ పార్క్ లో గల ప్లాట్ల వారు సుమారు 79 లక్షల20 వేల రూపాయలు డిమాండ్ తో కూడిన పన్నులను ఐలాకి చెల్లించాల్సి ఉంది.
దీనితో పాటు పన్నుల పాత ఎరియర్స్ బకాయిలు సుమారు 72 లక్షల 01 వేయి రూపాయలు గా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఎరియర్స్ బకాయిలో మొండి పదులుగా సుమారు 70 ప్లాట్ల వారు ఉన్నట్లు సమాచారం.2026 మార్చి నాటికి 55 లక్షల 66 వేల రూపాయలు వసూలు అయిన్నట్లు,72 లక్షల 01 వేల ఎరియర్స్ లో 14 లక్షల 87 వేల రూపాయలు మాత్రమే వసూలు అయినట్లు సమాచారం.ప్రస్తుతం సుమారు 120 ప్లాట్ల వారి వద్ద నుండి ఐలా కి పన్నుల రూపంలో సుమారు 80 లక్షల 67 వేల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఐలా వారు అంటున్నారు.
ఇండస్ట్రీయల్ పార్క్ లో ఉన్న పలు మద్య తరహా కర్మాగారాల వల్ల వస్తున్న కాలుష్యంతో డ్యామేజ్ అవుతున్నాయని,తద్వారా పనులను చేసుకోలేకపోతున్నామని ఆటోనగర్ లో కొందరు ఆరోపణలు బలంగా చేస్తున్నారు.మరో పక్క ఇండస్ట్రీయలో పార్క్ లో ఉన్న వారు మాత్రం కొందరు పనిగట్టుకొని పాడైన ఒక్కటి రెండు బోర్లను చూపించి,మొత్తం పొల్యూషన్ అయిందని వారి మీద నెపం మోపటం సరికాదని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాదిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రభుత్వంలోని పెద్దలు,అధికారులు సకాలంలో స్పందించి కాలుష్య సమస్యలను పరిష్కరించకపోవడంతో సమస్య జగ్గయ్యపేట ఆటోనగర్ ప్రాంతంలో మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు.దీనితో ఆటో నగర్ ప్లాట్ల లో పనులు,వ్యాపారలు చేసుకోవాలంటే కొందరు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని దీనికి ఎవ్వరు కారణమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జగ్గయ్యపేట ఆటోనగర్ కాలుష్యం కాస్త ప్రజా ఉద్యమంగా మారింది.దీనికి అధికారులు పాపం మూటగట్టుకున్నారనే చెప్పుకోవచ్చు.
ఒక్క పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీయల్ అభివృద్ధి చేయాలనే ఆలోచిస్తుంటే,మరో పక్క అధికారుల వైఫల్యం వల్ల కర్మాగారాల కాలుష్యాని నియంత్రించే పర్యవేక్షణలో లోపభూయిష్టంగా మారడం కాలుష్యం తో ప్రజా ఉద్యమాలు ముందు పీఠాన నిలబడుతున్నాయనే చెప్పుకోవచ్చు.ఇప్పటికే ఇటువంటి చర్యల వల్ల జగ్గయ్యపేట కి వచ్చే డిఫెన్స్ పరిశ్రమ పరిస్థితి తెలంగాణ కి తరలి వెళ్ళేటట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైన ప్రభుత్వ అధికారులు కాలుష్యం పై సరైన నిర్ణయంతో పరిష్కరించాలని,ఆటో నగర్ ప్లాట్లలో డ్యామేజ్ అయిన బోర్లు గల వ్యాపార వర్గాల కు పూర్తిగ పన్ను మినహాయింపులు ఇచ్చి,వారికి నష్టపరిహారం అందించాలని,ఐలా నిర్వహణలో వస్తున్న సమస్యలను పరిష్కరించలేని,పేరుకుపోతున్న పన్నుల బకాయిల వసూలు జాప్యం చేస్తున్న అధికారుల పై తక్షణమే చర్యలు తీసుకొని,సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0