పులిచింతల జెన్కో కార్మికుల తొలగింపు అన్యాయం

పులిచింతల స్టూడియో భారత్ పత్రినిధి

Jul 7, 2026 - 11:09
 0  28
పులిచింతల జెన్కో కార్మికుల తొలగింపు అన్యాయం

పులిచింతల జెన్కో కార్మికుల తొలగింపు అన్యాయం

పర్మినెంట్ చేయాలని కోరిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం దుర్మార్గమని మాజీ జెడ్పీటీసీ, హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల సైదిరెడ్డి విమర్శించారు.15 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

స్థానిక కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.కార్మికులకు సంఘీభావం తెలిపిన వారిలో చింతలపాలెం మాజీ మండల పార్టీ అధ్యక్షులు మోర్తాల వెంకటరెడ్డి గుడిమల్కాపురం సర్పంచ్ పోలీడ్ని నరసమ్మ శ్రీనివాసరావు చింతలపాలెం సర్పంచ్ కందుల రామకోటి రెడ్డి, ఎర్రకుంట తండా సర్పంచ్ రవి, బిఆర్ఎస్ నాయకులు షేక్ మైబల్లి, చింత్రియాల సైదులు, వీరమల్ల సుందరయ్య తదితరులున్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news