మున్సిపాలిటీ చైర్మన్ పదవి కూటమిదా లేక వైకాపా పార్టీ దా
స్టూడియో భారత్ పత్రినిధి
మున్సిపాలిటీ చైర్మన్ పదవి కూటమిదా లేక వైకాపా పార్టీ దా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ గందరగోళం రాబోయే మున్సిపల్ ఎన్నికల పై ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది ....
ఇటువంటి గందరగోళ రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో కొత్త వ్యక్తులకు అవకాశం కలిగేనా ....
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాలం పూర్తి కావస్తున్న తరుణంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే 2021 లో జరిగినప్పుడు అప్పటి అధికార పార్టీ వైయస్ఆర్ సిపి నుండి 31 వ వార్డులకు గాను 17 కౌన్సిల్ స్థానాలను దక్కించుకొని వైకాపా పార్టీ తరుపున రంగాపురం రాఘవేంద్ర రావు కి చైర్మన్ పీఠాన్ని అధిరోహించడం జరిగిన సంగతి అందరికి విదితమే.
2024 సంవత్సరంలో ఏపిలో కూటమి పార్టీ అధికారాన్ని చేపట్టడం జరిగింది.కూటమి పార్టీ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీ లో పాలక మండలి ని అధికార పార్టీ చేజిక్కించుకోవడానికి అవిశ్వాసాని పెట్టి బలం పరీక్షలలో అధికార పార్టీ మున్సిపాలిటీ ని దక్కించుకోవడం జరిగింది.
కాని జగ్గయ్యపేట మున్సిపాలిటీ పాలక మండలి అధికారికంగా వైయస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఉండగా చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధికార తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకోవడంతో ఎటువంటి అవిశ్వాసం పెట్టకుండా,బల పరీక్షలను నిర్వహించకుండా మున్సిపాలిటీ పాలక మండలి ని తెలుగుదేశం పార్టీ గా చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ప్రకటించుకున్నారు.పాలకమండలి వైస్ చైర్మన్ గా వైకాపా పార్టీ తరుపున ముస్లిం మహిళలనే కొనసాగుతుండటం ఇప్పటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
మున్సిపాలిటీ లో జన సేన పార్టీ సింబల్ తరుపున పోటీ చేయని వారు వైకాపా నుండి గెలిచిన వారిలో సుమారు 11 మంది మేము జనసేన పార్టీ కి చెందిన వారమని బహిరంగంగా చెప్పుకుంటున్నారు.ఇటువంటి గందరగోళ రాజకీయ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనే చెప్పుకోవచ్చు.మున్సిపల్ చైర్మన్ మాత్రం సందట్లో సడేమియా మాదిరిగా పనులను చక్కదిద్దుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధికారం చేపడిందని,మున్సిపల్ లో పాలక మండలి అవిశ్వాస పరీక్షలలో తెలుగుదేశం పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులు దక్కుతాయని ఆశ పడ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు బయటకు చెప్పుకోలేక అసంతృప్తి తో ఉంటున్నట్లుగానే భావించు కోవచ్చు.
జగ్గయ్యపేట నాయకుల కోసం చొక్కాలు చించుకున్న కార్యకర్తలు జగ్గయ్యపేట మున్సిపల్ పాలక మండలి వ్యవహ శైలి చూసి కొందరు కార్యకర్తలు ఆయా పార్టీలకు దూరమౌతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇటువంటి తీరు పట్ల జగ్గయ్యపేట తెలుగు దేశం,జనసేన పార్టీల అధిష్టాన నాయకులు తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారనే చెప్పుకోవచ్చు.
ఇటువంటి తీరు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో రాజకీయాలకు అతీతంగా స్వతంత్రం అభ్యర్థుల వైపు ప్రజలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇప్పటికైన జగ్గయ్యపేట మున్సిపాలిటీ లో బల పరీక్షలను నిర్వహించి పాలక మండలి ఏ పార్టీ దో తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0