ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన ఉచిత ఇసుక రవాణా పథకం
స్టూడియో భారత్ పత్రినిధి
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన ఉచిత ఇసుక రవాణా పథకం
జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం ప్రకారం, ఇసుక ఉచితం అయినప్పటికీ దాని రవాణాకు వాడే వాహనాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది.జగ్గయ్యపేట నియోజకవర్గంలో అధికారికంగా ఒక్కటి రెండు ఇసుక రీచ్ లు ఉన్నట్లు తెలుస్తోంది.అధికారికంగా ఉన్న ఇసుక రీచ్ ల నుండి లేక సప్లై పాయింట్ నుంచే ఇసుక తీసుకోవాలి.ఆన్ లైన్ లో లేదా గ్రామ/వార్డు సచివాలయం ద్వారా నమోదు చేసి ఈ - ట్రాన్సిట్ ఫాం (పర్మిట్) తప్పనిసరిగా పొందాలి.పర్మిట్ లేకుండా ఇసుక రవాణా చేయరాదు.అధికారులు కేటాయించిన తేదీ మరియు టైమ్ స్లాట్ బుకింగ్ లోనే వాహనం రీచ్ కు వెళ్లి లోడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వ్యక్తిగత వినియోగం కోసం తీసుకున్న ఇసుకను తిరిగి అమ్మడం నిషేధం. అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. "ఉచిత ఇసుక రవాణా వాహనం" అనే బ్యానర్‌ను వాహనం ముందు భాగంలో తప్పని సరిగా కనబడేలా ఉండాలి.ట్రాక్టర్లకు జిపియస్ లేదా జిపియస్ - ఇనేబుల్డ్ యాప్ తప్పని సరిగ ఉండాలి.ఇవేవి లేకుండా పర్మిట్ లేకుండా లేదా అక్రమంగా ఇసుక తరలిస్తే వాహనం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించి,కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.ఇటువంటి నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరిగ అనుసరించాల్సి ఉండగా జగ్గయ్యపేట నియోజకవర్గం లో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఉచిత ఇసుక రవాణా రాష్ట్రం దాటి అక్రమంగా దొడ్డిదారిన తెలంగాణ కి తరలి వెళ్ళడంతో ఉచిత ఇసుక అక్రమ రవాణా దారులకు కాసుల వర్షం కురిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒక్క వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఉండవు,మరో పక్క ఓవర్ లోడ్ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళుతున్న సంఘటనలు నిత్యంగా మారింది.ఇప్పటి ఉచిత ఇసుక అక్రమ రవాణా ని అధికారులు నివారించి,రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుక సద్వినియోగ పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దీని ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో ప్రజలు బహిరంగంగా వేచి చూడాల్సి ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0