మెడికల్ షాపులలోని గది ఉష్ణోగ్రత ని సరిగ మెయింటెయిన్ చేస్తున్నారా!

స్టూడియో భారత్ పత్రినిధి

May 5, 2026 - 08:38
 0  12
మెడికల్ షాపులలోని గది ఉష్ణోగ్రత ని సరిగ మెయింటెయిన్ చేస్తున్నారా!

మెడికల్ షాపులలోని గది ఉష్ణోగ్రత ని సరిగ మెయింటెయిన్ చేస్తున్నారా!

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల పాడైపోతున్న మందులు 

అవి మింగితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నటేనంటున్న మేధావులు ....

పట్టించుకొనే వారెవ్వరు .... సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు 

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణం,నియోజకవర్గంలో మానవాళి ఆరోగ్య అవసరాల కోసం ప్రైవేటు మెడికల్ షాపులు ఉన్నాయి.ఈ మెడికల్ షాపులలో అధికారుల పర్యవేక్షణ లోపభూయిష్టమనే చెప్పుకోవచ్చు.మెడికల్ షాపులు లైసెన్స్ మాత్రం అధికారులు మంజూరు చేసి చేతులు దులుపుకుంటున్నారనే వాదనలు లేకపోలేదు.

పర్యవేక్షణ అధికారులు మాత్రం మెడికల్ షాపుల వారు చేతులు తడుపుతున్నారనే పలువురు ఆరోపణలతో మెడికల్ షాపుల వారు నిబంధనలు సైతం గాలికి వదిలేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీనితో మెడికల్ షాపులలో గది ఉష్ణోగ్రత 15°C–25°C గా,ఫ్రిజ్ టెంపరేచర్ 2°C–8°C లో గా టెంపరేచర్ లాగ్ (daily record) మెయింటైన్ చేస్తేనే మందులు పాడవవని,లేకపోతే అవి పాడై రీయాక్షన్ కూడా అయ్యే ప్రమాదాలు లేకపోలేదనే అందరికి తెలిసిన విషయమే.

ఎన్ని షాపుల వారు ఈ నిబంధనలను పాటిస్తున్నారో అధికారుల దగ్గర లెక్కలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అసలు వేసవి కాలం కావడం గది ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో మెడికల్ షాపుల వారు నిబంధనల ప్రకారం పాటించాల్సిన ఉష్ణోగ్రత ను జగ్గయ్యపేట పట్టణం,నియోజకవర్గ ప్రాంతంలో ఎంతమంది పాటిస్తున్నారు.ప్రతి మెడికల్ షాపులను అధికారులు తనిఖీలు చేసి వేసవి దృష్టిలో పెట్టుకొని మందులు పాడు కాకుండా ఉండటానికి నిబంధనల ప్రకారం ఉండవలసిన గది ఉష్ణోగ్రతలను ప్రతి మెడికల్ షాపుల వారు పాటించేలా చర్యలు చేపట్టి ప్రజారోగ్యాలను కాపాడాలని సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు అధికారులను కోరుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news