అవినీతి నిరోధక శాఖ దాడులలో జి.హెచ్.ఎం.సి టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత
మెహిదీపట్నం
అవినీతి నిరోధక శాఖ దాడులలో జి.హెచ్.ఎం.సి టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత
మెహదీపట్నం
మెహదీపట్నం జిహెచ్ఎంసి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్‌కు సంబంధించిన వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ఫ్లాన్‌తో వల పన్ని పట్టుకున్నారు.ఓ నిర్మాణ భవనానికి సంబంధించిన అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
దయచేసి దీనిని కూడా చదవండి ... https://studiobharat.com/Government-support-onion-farmers
అందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ACB అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సునీతను అదుపులోకి తీసుకున్న అనంతరం మెహదీపట్నం GHMC కార్యాలయంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు.సంబంధిత ఫైళ్లు, పత్రాలు, రికార్డులను పరిశీలించిన అధికారులు,కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0