అంతర్జాతీయ వేదిక పై టీడీ జనార్ధన్
చైనా స్టూడియో భారత్ ప్రతినిధి
అంతర్జాతీయ వేదిక పై టీడీ జనార్ధన్
చైనాలో అంతర్జాతీయ సహకార సమాఖ్య బోర్డు సమావేశానికి హాజరు
చైనా - 19సెప్టెంబర్2026 :
అంతర్జాతీయ సహకార రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు,ప్రపంచవ్యాప్తంగా సహకార వ్యవస్థల అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై చైనాలో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సమాఖ్య (International Cooperative Alliance – ICA) బోర్డు సమావేశంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ,ఎన్టీఆర్ లీటరేచర్ కమిటీ చైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సహకార రంగ ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొని సహకార సంస్థల అభివృద్ధి,వాటి నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు,అంతర్జాతీయ పరస్పర భాగస్వామ్యం, సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించారు.ఈ చర్చల్లో టీడీ జనార్ధన్ భాగస్వామ్యమై సహకార రంగానికి సంబంధించిన పలు అంతర్జాతీయ అంశాలను తెలుసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సహకార వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు,సహకార సంస్థలను మరింత బలోపేతం చేయడం,వివిధ దేశాల మధ్య అనుభవాలు,ఆలోచనల మార్పిడి వంటి అంశాలు సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఇటువంటి సమావేశాలు సహకార రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడంతో పాటు వివిధ దేశాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, అభివృద్ధికి దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి.... https://studiobharat.com/Increase-prices-essential-commodities-due-Elinova
అంతర్జాతీయ సహకార సమాఖ్య బోర్డు సమావేశంలో పాల్గొనడం ద్వారా ప్రపంచ సహకార రంగంలో వస్తున్న మార్పులు,అభివృద్ధి అవకాశాలను పరిశీలించే అవకాశం లభించింది.ఈ పర్యటనతో సహకార రంగానికి సంబంధించిన అంతర్జాతీయ అనుభవాలు,ఆలోచనలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0