నియోజకవర్గంలో ఎన్ని కుంటలలో క్యాట్‌ ఫిష్ పెంపకం జరుగుతుంది...

జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి

Sep 8, 2026 - 12:52
 0  136
నియోజకవర్గంలో ఎన్ని కుంటలలో క్యాట్‌ ఫిష్ పెంపకం జరుగుతుంది...

నియోజకవర్గంలో చెరువులా తలపించే కుంటలో అసలు ఏ జరుగుతుంది...

ఎన్ని కుంటలలో క్యాట్‌ ఫిష్ కోడి వ్యర్థాల ఆహారంగా వాడుతున్నారనే ప్రశ్నలు కలకలం!

అనుమతుల్లేకుండా పెంపకమా లేక అధికారుల కనుసన్నలలో జరుగుతుందా అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సహజ సిద్ధమైన వాగులు,చెరువులకు ముప్పు పొంచి ఉందనే ప్రజల ఆరోపణలు....

జగ్గయ్యపేట: 

జగ్గయ్యపేట,వత్సవాయి,పెనుగంచిప్రోలు మండలాలలో నిబంధనలకు విరుద్ధంగా క్యాట్‌ ఫిష్ పెంపకం జరుగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.వత్సవాయి మండలం లింగాల–ఆళ్ళూరుపాడు రహదారిలో రైల్వే బ్రిడ్జి సమీపంలోని నీటి కుంటలో ఎలాంటి అనుమతులతో ఈ పెంపకం కొనసాగుతోందని ప్రజల నుండి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఉంటున్నాయా అన్నే ప్రశ్నలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

క్యాట్‌ ఫిష్‌ కు కోడి వ్యర్థాలను ఆహారంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.కోడి వ్యర్థాల కారణంగా నీరు కలుషితమై దుర్వాసన వస్తోందని, పరిసరాల్లో పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు గుసగుసలాడుతున్నారు.కలుషిత నీరు నియోజకవర్గంలో గల వాగులు,చెరువులకు వెళ్ళే ప్రవాహంలోకి చేరితే జలవనరులు,పశువులు,జీవవైవిధ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.

నియోజకవర్గంలో పర్యావరణ పర్యవేక్షణ ఎక్కడ?

జగ్గయ్యపేట నియోజకవర్గంతో పాటు వత్సవాయి,పెనుగంచిప్రోలు మండలాలలో పలు ప్రాంతాల్లో నీటి వనరులు,కాలుష్యం, అక్రమ కార్యకలాపాలపై తరచూ స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎంతమేర పర్యవేక్షణ చేస్తున్నారనే ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు మున్నేరు వంటి సహజ నీటి వనరుల పరిరక్షణపై చర్చ జరుగుతుండగా.. మరోవైపు వాటికి కలుషిత నీరు చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న ఆరోపణలు రావడం అధికార యంత్రాంగం పనితీరుపై విమర్శలకు తావిస్తోంది.

అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజలకు కనిపించే స్థాయిలో ఒక నీటి కుంటలో పెంపకం జరుగుతున్నప్పుడు సంబంధిత అధికారులు, పంచాయతీ, మత్స్యశాఖ,కాలుష్య నియంత్రణ అధికారులు ఇప్పటివరకు ఎందుకు పరిశీలించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేయడం, నీటి నాణ్యతను పరీక్షించడం, వ్యర్థాల నిర్వహణ నిబంధనలు పాటిస్తున్నారా లేదా చూడడం అధికారుల బాధ్యత కాదా? అని స్థానికులు నిలదీస్తున్నారు.

ఉన్నతాధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, పెంపకానికి సంబంధించిన అనుమతులు, నీటి నాణ్యత, వ్యర్థాల నిర్వహణ,వాగులు,చెరువుల ప్రవాహంపై ప్రభావం వంటి అంశాలపై నియోజకవర్గంలో సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే నిర్వాహకులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఆరోపణల్లో వాస్తవం లేదని తేలితే అధికారికంగా స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యం, పశువులు, జలవనరులు, పర్యావరణానికి సంబంధించిన అంశంలో పలు ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్న కూడా అధికారులు స్పందించకపోతే బాధ్యత ఎవరిది...నిబంధనలను ఉల్లంఘిస్తున్నది ఎవరు? పర్యవేక్షణలో విఫలమవుతున్నది ఎవరు? అనే ప్రశ్నలకు ఉన్నతాధికారుల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు ఎప్పుడు? పర్యావరణానికి నష్టం జరిగే వరకు అధికారులు వేచి చూస్తారా? లేక ముందస్తు చర్యలతో నియోజకవర్గంలో గల వాగులు,చెరువులను ప్రజలను కాపాడుతారన్నది ఇప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.అధికారులు దీని పై ఏవిధంగా స్పందించి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి....✍️మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news