భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు
నందిగామ
భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు
నందిగామ కాకాని నగర్‌లో అంగరంగ వైభవంగా అన్నదానం..
లక్కీ డ్రా.. శోభాయాత్ర
నందిగామ
యన్.టి.ఆర్. జిల్లా నందిగామ పట్టణంలోని కాకాని నగర్‌లో గణేష్ యువశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో మాదాల అజేయ్ బాబు నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం,లక్కీ డ్రా,వినాయక శోభాయాత్ర నిర్వహించారు.వినాయక విగ్రహాన్ని చదల శ్రీనివాసరావు దాతగా అందించగా, కాలి రాము తదితరులు ఉత్సవ ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు.అన్నదాన కార్యక్రమాన్ని పి. వెంకట్రావు, నాగసాయి, వీరాచారి తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.అన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, గద్దె రమేష్, వెంకట్ జ్వాల, ఏచూరి రాము కుటుంబ సభ్యులు, విద్యార్థులు తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
రూ.100 లక్కీ డ్రాలో లడ్డూ విజేత
ఉత్సవాల్లో భాగంగా రూ.100 రశీదుతో నిర్వహించిన లక్కీ డ్రా భక్తుల్లో ఆసక్తిని రేకెత్తించింది. లక్కీ డ్రాలో అజ్మీర సూరిబాబు విజేతగా నిలిచి స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.
కోలాటాలతో కనుల పండువగా శోభాయాత్ర
వినాయకుని నిమజ్జనాన్ని పురస్కరించుకుని స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగించారు. మహిళా భక్తులు సంప్రదాయబద్ధంగా కోలాటాలు ఆడుతూ శోభాయాత్రలో పాల్గొనడంతో కాకాని నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల జయజయధ్వానాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
దయచేసి దీనిని కూడా చదవండి ... https://studiobharat.com/employment-Environmental-protection-along-with-industrial-development-requires-an-integrated-approach
రామన్నపేట కృష్ణానదిలో నిమజ్జనం
అనంతరం గణేష్ యువశక్తి ఉత్సవ కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా స్వామివారిని రామన్నపేట కృష్ణానదికి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0