ఆదాయం పెరగక.. ఖర్చులు భారమై.. మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి
ప్రత్యేక కథనం
ఆదాయం పెరగక.. ఖర్చులు భారమై.. మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి
రూ.10 వేల నుంచి రూ.18 వేల జీతాలతో కుటుంబ పోషణ కష్టమేనంటున్న ఉద్యోగులు
ప్రత్యేక కథనం
రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, మారని లేదా నెమ్మదిగా పెరుగుతున్న జీతాలు మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా షాపుల్లో పనిచేసే ఉద్యోగులు, స్కీం వర్కర్లు, అవుట్‌సోర్సింగ్ కార్మికులు నెలకు రూ.7 వేల నుంచి రూ.18 వేల వరకు జీతాలు పొందుతూ కుటుంబాలను పోషించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.కేంద్ర కార్మిక శాఖ 2017లో కనీస వేతనాల ప్రాథమిక రేట్లను సవరించగా, అనంతరం ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని Variable Dearness Allowance (VDA) ద్వారా కాలానుగుణంగా సవరణలు చేస్తోంది.
అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో ఆహారం, కూరగాయలు, ఇంటి అద్దెలు, విద్య, వైద్యం, రవాణా, గ్యాస్, విద్యుత్ వంటి ఖర్చులు వేగంగా పెరగడంతో కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతోంది.ప్రస్తుతం స్థానికంగా అనేక షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు సుమారు రూ.10 వేల వరకు, కొన్ని స్కీం వర్కర్లకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు పారితోషికం అందుతున్నట్లు తెలుస్తోంది. అయితే నలుగురు సభ్యుల కుటుంబానికి నెలవారీ ఆహారం, అద్దె, పిల్లల చదువు, వైద్యం, ప్రయాణ ఖర్చులు కలిపి చూస్తే ఈ ఆదాయం సరిపోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, కనీస వేతనం అనేది చట్టబద్ధమైన కనిష్ట రక్షణ మాత్రమే. కానీ కుటుంబ జీవన వ్యయం, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, అద్దెలు, ఇతర అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే “జీవన వేతనం” (Living Wage) అనే అంశంపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
దయచేసి దీనిని కూడా చదవండి ... https://studiobharat.com/Jaggayyapet-needs-more-ambulances
ఆదాయం–ఖర్చుల మధ్య అంతరం పెరగడం వల్ల పొదుపు తగ్గిపోవడం, అప్పులపై ఆధారపడడం, కుటుంబాల్లో ఆర్థిక ఒత్తిడి పెరగడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని సామాజిక పరిశీలకులు చెబుతున్నారు.“జీతం పెరిగిందా?” అన్నదికంటే, “ఆ జీతంతో ఒక కుటుంబం గౌరవంగా జీవించగలుగుతోందా?” అనేదే నేడు ప్రధాన ప్రశ్నగా మారింది.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0