మళ్లీ డబుల్ సెంచరీ కొట్టిన జైస్వాల్
ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం.. స్టూడియో భారత్ ప్రతినిధి
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ ముందు భారత్ భారీ లక్ష్యం నిలిపింది. యువ బ్యాటర్ 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల లక్ష్యం నిలిచింది. టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 214 రన్స్, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.యశస్వి జైస్వాల్ మరోసారి డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న
మూడో టెస్టులో భారత్..భారీ స్కోరు చేసింది.మూడో రోజు రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ నాలుగో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.దూకుడుగా ఆడి ఈ సిరీస్‌లో రెండో డబుల్ సెంచరీని నమోదు చేశాడు.దీంతో భారత్ 430/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. యశస్వి జైస్వాల్ 214, శుభ్‌మన్ గిల్ 91, సర్ఫరాజ్ ఖాన్ 68 రాణించారు.ఓవర్ నైట్ స్కోరు 196/2తో మూడో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్..దూకుడుగా ఆడింది.శుభ్‌మన్ గిల్,కుల్‌దీప్ యాదవ్ లు వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించడంతో టీమిండియా వేగంగా పరుగులు రాబట్టింది. రెండో టెస్టులో సెంచరీతో రాణించిన గిల్..మరోసారి సెంచరీ చేసేలా కనిపించాడు.అయితే కుల్‌దీప్ యాదవ్‌తో సమన్వయ లోపంతో గిల్ రనౌట్ అయ్యాడు.
అతడి ఓక్కడిని ఓడించండి సియం జగన్....
https://studiobharat.com/CM-Jagan-defeated-one-of-them ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
దీంతో సెంచరీకి మరో 9 పరుగుల దూరంలో నిరాశగా వెనుదిరిగాడు. ఉన్నంత సేపు ఆకట్టుకున్న కుల్‌దీప్ యాదవ్ చివరకు 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.ఇందులో ఓ సిక్స్, 3 ఫోర్లు ఉన్నాయి.శుభ్‌మన్ గిల్ ఔట్ కావడంతో క్రీజులో వచ్చిన సెంచరీ హీరో యశస్వి జైస్వాల్..వచ్చీరాగానే బాదుడు మొదలు పెట్టాడు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. 231 బంతుల్లో డబుల్ సెంచరీ స్కోరు చేశాడు.ఈ సిరీస్‌లో జైస్వాల్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం గమనార్హం.జైస్వాల్‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ సైతం మెరుపులు మెరిపించాడు.కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న ఈ బ్యాటర్..తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
ఇందులో 3 సిక్స్‌లు, 6 ఫోర్‌లు ఉన్నాయి. ఈ మ్యాచులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేసింది.ఇంగ్లాండ్‌ను 319 పరుగులకు పరిమితం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 430/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఫలితంగా ఇంగ్లీష్ జట్టు ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది.
What's Your Reaction?