భవిత సెంటర్ కు జగ్గయ్యపేట సిఐ పీ.వెంకటేశ్వర్లు ₹.10,000 వితరణ

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 19, 2024 - 05:15
 0  140
భవిత సెంటర్ కు జగ్గయ్యపేట సిఐ పీ.వెంకటేశ్వర్లు ₹.10,000 వితరణ

భవిత సెంటర్ కు జగ్గయ్యపేట సిఐ పీ.వెంకటేశ్వర్లు ₹.10,000 వితరణ

ఏపీఎంపీఏ స్పైరల్ బైండింగ్ మిషన్ వితరణ కార్యక్రమంలో ప్రకటన

జగ్గయ్యపేట:

జగ్గయ్యపేటలోని సీతారాంపురంలో ఉన్న ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాల ‌భవిత సెంటర్ కు జగ్గ య్యపేట పోలీస్ సిఐ పి వెంకటేశ్వర్లు ₹.10,000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

సోమవారం జగ్గయ్యపేట నియోజక వర్గ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెష నల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం సంద ర్భంగా భవిత సెంటర్ కు స్పైరల్ బైండింగ్ మిషన్ ను జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు, ఎంఈఓ ఎల్ చిట్టిబాబు, ఎస్ఐ జి రాజు చేతుల మీదగా సెంటర్ ఉపాధ్యాయురాలు ఉదయలక్ష్మి కి అందజేశారు. ఈ సంద ర్భంగా భవిత సెంటర్ లో ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగులైన విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, సేవలను తెలుసుకున్న సిఐ వెంకటేశ్వర్లు తన వంతుగా సెంటర్ కు వివిధ సందర్భాలలో ప్రభుత్వం ఇచ్చిన రివార్డుల మొత్తం నుంచి పదివేల రూపా యలు అందజేస్తానని,పాఠశాల అవస రాలకు వినియోగించుకోవాలని కోరారు. ఇలాంటి సెంటర్ నడుస్తుందన్న విషయం తనకు ఇప్పటివరకు తెలియదని ఎపిఎం పిఏ యూనియన్ ఆహ్వానం మేరకు వచ్చి తెలుసుకోగలిగానని చెప్పారు.సోమవారం భవిత సెంటర్లో ఫిజియో థెరపీ చేయించుకునేందుకు వచ్చిన దివ్యాంగులతో ఆయన ముచ్చ టించారు.తనకు ఈ తరహా సేవలు అంటే ఎంతో ఇష్టమని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తెలియ చేయవచ్చని సిఐ చెప్పారు.         

ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీఎంపీఏ ప్రధాన కార్యదర్శి కళ్యాణపు సూర్యప్రకాష్,పీఆర్వో మెటికల శ్రీనివాసరావు,జగ్గయ్యపేట నియోజకవర్గ ఏపీఎంపీఏ అధ్య క్షుడు కాకరపర్తి వెంకట రమేష్,కార్యదర్శి గడ్డం రాంబాబు,కోశాధికారి యండ్రాతి రాకేష్,జాయింట్ సెక్రటరీ వల్లాపురపు వెంకన్నబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నా వంశీ, సోషల్ మీడియా కన్వీనర్ కరిసే మధు,లీగల్ అడ్వైజర్ మరువాడ ఉమామహేశ్వర మనోహర్ రావు,బాణావత్ సురేష్ నాయక్,సీనియర్ పాత్రికే యులు పివిఎస్ఎల్ ప్రభాకర్, దేవరకొండ శ్రీనివాసరావు,బేతు రంగా,తాళ్లూరి దుర్గ,జహంగీర్ భాష,చింత్రియాల గోపి,ఐ శ్రీనివాసరావు,అన్నెపాగ పవన్ కార్తీక్,తురక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow