మిర్చి రైతులను ఆదుకోండి - సిపిఐ

బోనకలు స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 2, 2023 - 10:42
 0  36
మిర్చి రైతులను ఆదుకోండి - సిపిఐ

మిర్చి రైతులను ఆదుకోండి - సిపిఐ

బోనకల్ :

తెగులు దొప్ప లాంటి వైరస్ షోకి నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని సిపిఐ బోనకల్ మండల సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో తెగులు, దోప్ప వైరస్ సోకిన పంటపొలాలను సిపిఐ బోనకల్లు మండల బృందం పర్యటించింది.ఈ సందర్భంగా సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల నుండి మిర్చి రైతులను వైరస్ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. 2021, 22 సంవత్సరాల కాలంలో నల్ల నల్లి ఎర్రనల్లి మిర్చి రైతులను అప్పుల పాలు చేసిందన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక వైరస్ మిర్చి రైతులను ఇబ్బందులు కురిచేస్తూ దిగుబడి తగ్గేలా చేస్తున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

ఇప్పటివరకు ఎర్ర నల్లి, నల్ల నల్లి ఎందుకు వస్తుందో తెలుసుకోకపోవడం శోచనీయమన్నారు.ఈ సంవత్సరం తెగులు,దొప్పలతో మిర్చి పంట మొత్తం దెబ్బతింటుందన్నారు.గత సంవత్సరంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయలేదన్నారు.ఈ సంవత్సరం మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో మిర్చి రైతులకై పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఆకిన పవన్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ఏనుగు రామకృష్ణ, మండల నాయకులు ఏనుగు రవి, రైతులు గంగదేవుల రామకృష్ణ, గంగదేవుల నాగయ్య, చంపసాల వెంకటకృష్ణ, గంగ దేవల నరసింహ, కొండపనేని రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow