జగ్గయ్యపేట ఎన్నికల సర్వేలు వణుకు పుట్టిస్తున్న నిజాలు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
జగ్గయ్యపేట ఎన్నికల సర్వేలు వణుకు పుట్టిస్తున్న నిజాలు....
జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగ్గయ్యపేట నియోజకవర్గం భిన్నంగా ఉంటుంది.జగ్గయ్యపేట ఎన్నికల్లో స్థానికత,సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషించాయి.జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో మొత్తం సుమారు 2 లక్షల 6 వేల ఓట్లలో సుమారు 1 లక్షా 80 వేల ఓట్లు పోలై నాయకుల తలరాతను,వారి భవిష్యత్తు ను ఈవియంలో నిక్షిప్తం చేయడం జరిగింది.ముఖ్యంగా యస్.టి,యస్.సి,బిసి, మైనారిటీ,ఓసి కులాల మీద జగ్గయ్యపేట ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.
సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగ్గయ్యపేట ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తుంటారు.2024 మే ఎన్నికలు మాత్రం దీనికి భిన్నంగా ఉందనే చెప్పుకోవచ్చు.ప్రధాన అధికార వైకాపా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెదేపా నాయకులు,కార్యకర్తలు ఎవ్వరికి వారే మెజారిటీతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.ఇప్పటి వరకు చూస్తే కొంతమంది వైసీపీకి సుమారు 5000 ఓట్ల మెజారిటీ వస్తుందని,మరికొంత మంది కూటమి లో తెదేపా కి మెజారిటీ ఓట్ల పైనే వస్తుందని అంచనాలతో ఎవ్వరి గెలుపు పై ఎవ్వరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై ఇరుపార్టీల రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు.ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారో అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదనే చెప్పుకోవచ్చు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండడంతో, రాష్ట్రంలో సర్వే సంస్థలు తమ నివేదికను తెలియజేయడానికి వెనకడుగు వేస్తున్నాయి.రాష్ట్రంలో కన్న జగ్గయ్యపేటకి చాలా రాజకీయ వ్యత్యాసం ఉంది.జగ్గయ్యపేటలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు,సమీకరణాలు ఉన్నాయి.ఈ ప్రాంతంలో వ్యక్తిగత కక్షలు,వ్యక్తులపై రాజకీయ దాడులు కూడా కనిపించాయి.
Follow the STUDIOBHARAT channel...
https://youtu.be/gsBU7NUQ6Z8?si=Kl6dUCyZjjtS0lzi .... దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం జాయిన్ గ్రూప్ & సబ్ స్రైబ్ చేసుకోండి..
దీంతో జగ్గయ్యపేట ప్రాంతంలో ఎవ్వరు గెలుస్తారనే ప్రజలు ఆలోచనలలో పడ్డారు.దీనికి తగ్గట్లుగానే జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో ఎవ్వరు లేనట్లుగా కనిపిస్తుంది.మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు.గతంలో జగ్గయ్యపేట నియోజకవర్గం 2019 లో వైకాపా కి వచ్చిన మెజారిటీని సుమారు 4000 పైన ఓట్లను నిలబెట్టుకునే ప్రయత్నాలను దక్కించుకునేనా,లేక తెదేపా పార్టీ జగ్గయ్యపేట పట్టణ పట్టును నిలబెట్టుకోవడంలో ఆకర్షించే ప్రయత్నాలు చేసి మెజారిటీతో గెలుపును దక్కించుకునేనా!మరి ఎవరికి వారి అంచనాలు నిజం అవుతాయో జూన్ 4న వేచి చూడాలి మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు...
జగ్గయ్యపేట శాసనసభ ఫలితాల పూర్తి విశ్లేషణ కధనం త్వరలో మీ స్టూడియో భారత్ లో....
_మీకు తెలుసా!..దయచేసి చదవండి... కీ 'లేడీ' మాయ మాటలు చెప్పి కోటిన్నర కాజేసిన మాయలేడి .....
https://studiobharat.com/who-made-half-a-million-by-saying-Mayas-words ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?