ఎర్రచందనం దుంగలు స్వాధీనం స్మగ్లర్లు పరారీ
లంకమల స్టూడియో భారత్ ప్రతినిధి
లంకమల అభయారణ్యంలో కూంబింగ్
కడప జిల్లా
18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం: స్మగ్లర్లు పరారీ
లంకమల అభయారణ్యంలోని సిద్ధవటం రేంజ్,సిద్ధవటం బీట్ నందు సమస్యాత్మక ప్రదేశాలలో సోమవారం నిర్వహించిన కూంబింగ్ లో 18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని స్మగ్లర్లు పరారీ అయినట్లు రేంజర్ కళావతి తెలిపారు.రేంజర్ మాట్లాడుతూ కడప జిల్లా అటవీ శాఖాధికారి పి.వి సందీప్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్ధవటం ఫారెస్ట్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి కూంబింగ్ నిర్వహించామన్నారు.
సిద్ధవటం రేంజర్ కళావతి ఆధ్వర్యంలో గొల్లపల్లి డిప్యూటీ రేంజర్ ఓబులేసు,సిద్ధవటం ఇంచార్జ్ ఫారెస్ట్ బీటు అధికారి పెంచల్ రెడ్డి,సిద్ధవటం అసిస్టెంట్ బీటు అధికారి హైమవతి దేవి,బేస్క్యాంప్ సిబ్బంది,పోటెక్షన్ వాచేర్స్ తో కూడిన స్పెషల్ టీం సిద్ధవటం రేంజ్ లోని సిద్ధవటం బీట్ నందు సమస్యాత్మక ప్రదేశాలలో కూంబింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది ఎర్రచందనం చెట్లను నరుకుతూ కనిపించారన్నారు.వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా,దుంగలను అక్కడే వదిలేసి పారిపోయారన్నారు.మొత్తం 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,స్మగ్లర్ల కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు.
What's Your Reaction?