బాలికకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం

అనంతపురం స్టూడియో భారత్ ప్రతినిధి

Jun 27, 2023 - 10:30
 0  26
బాలికకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం

 "లైంగిక దాడి అత్యాచారంకు గురైన మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా వుంటుంది."

"ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులందరినీ చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం"

"ప్రస్తుతం బాలికకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం"

"అనంతపురంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన రాష్ట్ర మహిళా మంత్రి ఉషాశ్రీచరణ్ "

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గురుకుల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలిక పై జరిగిన లైంగిక దాడి అత్యాచారం ఘటనను తెలుసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు వెంటనే స్పందించి నేడు అనంతపురంలోని దిశ కేంద్రం/సఖి వన్ స్టాప్ సెంటర్ లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించి ప్రస్తుత బాలిక ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకుని జరిగిన ఘటనపై పోలీసు శాఖ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది..

ఉరవకొండ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి అత్యాచారంకు పాల్పడటం అత్యంత బాధాకరం.

బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా వుంటుంది,ప్రస్తుతం బాలికకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.ఈ దాడికి పాల్పడిన మరియు సహకరించిన వారందరిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ఈ ఘటనపై పోలీస శాఖ సత్వరమే స్పందించి నిందితులపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది.

రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరగకుండా ఖచ్చితంగా దిశా చట్టం ద్వారా బాలికపై దాడికి పాల్పడిన వారందరిని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఉషాశ్రీచరణ్ గారు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow