పింఛన్ల పంపిణీ తప్ప మిగతా 5 పథకాలు అమలు కావడం లేదు - సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్
కాకినాడ స్టూడియో బారత్ ప్రతినిది
పింఛన్ల పంపిణీ తప్ప మిగతా 5 పథకాలు అమలు కావడం లేదు సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్
AP రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని, టిడిపి కూటమి ఎన్నికల సందర్భంగా ప్రజలకు వాగ్దానం చేసిందని,అవి నమ్మి ప్రజలు ఓట్లు వేశారని,అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా,సామాజిక పింఛన్ల పంపిణీ తప్ప,మిగతా ఐదు పథకాలు ఇంకా అమలు కావడం లేదని సిపిఐ (యం యల్) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ అన్నారు.యువతకు సంబంధించి నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి,తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు,రైతులకు సంబంధించి ప్రతి రైతుకు ఏట 20,000 రూపాయలు ఆర్థిక సాయం,ప్రతి మహిళకు నెలకు 1500 (19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వరకు) ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,బీసీ,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం,మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ వంటి పథకాలను హామీ ఇచ్చారని అన్నారు.
ఖజానా చూస్తే ఖాళీగా ఉందని, ప్రభుత్వం శ్వేత పత్రం పేరుతో, సాగు పత్రాలు విడుదల చేసి పలాయన వాదం పాటిస్తుందని అన్నారు.ఖజానా ఖాళీగా ఉండేది,రాష్ట్రం అప్పులు కుప్ప అయిన విషయం తెలిసే టిడిపి కూటమి సూపర్ సిక్స్ పథకాలను హామీ ఇచ్చిందని ఆయన అన్నారు.ఈ పథకాలను తప్పించుకోవడం కుదరదని,కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు
What's Your Reaction?