ఆదివాసీల చిర‌కాల కోరిక‌ను నేర‌వేర్చింది సీఎం కేసీఆర్

సిరిసిల్ల స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 7, 2023 - 11:48
 0  92
ఆదివాసీల చిర‌కాల కోరిక‌ను నేర‌వేర్చింది సీఎం కేసీఆర్

ఆదివాసీల చిర‌కాల కోరిక‌ను నేర‌వేర్చింది సీఎం కేసీఆరే : మంత్రి కేటీఆర్

ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు,ఆదివాసీలకు భూముల ప‌ట్టాలు అందించి,వారి చిరకాల కోరికను నెర‌వేర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్ర‌మే అని రాష్ట్ర ఐటీ,ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.సిరిసిల్ల ప‌ట్ట‌ణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాల‌ను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణలో ఒక‌ లక్షా 51 వేల మందికి ఏకకాలంలో 44.6 లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు అందించామ‌ని చెప్పారు.దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు అందించలేదన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు 1614 మంది గిరిజనులకు 2858 ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు అందించామ‌ని పేర్కొన్నారు.భవిష్యత్తులో భూ హద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా అటవీ యాజమాన్య హక్కులు అందిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇది కూడా చదవండి...https://studiobharat.com/No-early-elections-in-AP-Sajjala

కుమురం భీం,జ‌ల్ జంగిల్ జ‌మీన్ నినాదా స్ఫూర్తితో 3 వేల తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా మార్చి,30 వేల వార్డుల‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు.తెలంగాణలో గిరిజనుల గడప గడపకు సంక్షేమం ఫలాలు అందేలా చూస్తున్నారు.గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించాo అని గుర్తు చేశారు.ఎస్టీ గురుకులాల్లో వేలాది మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని తెలిపారు.స్వరాష్ట్రం తెలంగాణలో ఆదివాసీలు,గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు.అన్ని తండాల‌కు 3ఫేజ్ క‌రెంట్ ఇస్తున్నాం.ఫ‌లితంగా కేసీఆర్ గిరిజ‌నుల గుండె చ‌ప్పుడు..ఆదివాసీల ఆత్మ‌బంధువు అయ్యార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow