ఆంద్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో ప్రభుత్వ ఖజానా సొమ్ము దుబారా?
అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి

ఆంద్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో ప్రభుత్వ ఖజానా సొమ్ము దుబారా?
అందని పాఠ్యపుస్తకాలు - పంపిణీలో భారీగా ప్రభుత్వ సొమ్ము అవ్వకతవ్వకలు
అమరావతి
ఆంధ్రప్రదేశ ఓపెన్ స్కూల్ ద్వారా ప్రతి యేటా లక్ష మంది విద్యార్థులు పదవ తరగతి మరియు ఇంటర్ కు దూర విద్య ద్వారా చదువుతున్నారు.వీరు అందరికి ఉచిత పాఠ్య పుస్తకాలను రెగ్యులర్ పాఠశాలలకు అందేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ద్వార మండలాలలో గల గుర్తింపు పొందిన అధ్యయన కేంద్రాలకు సరఫారా చేసి అందించాల్సి ఉంటుంది.ఈవిధంగా సరఫరా చేయడానికి యేటా ఆపాస్ కి 10 లక్షలు రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేది.కాని గత ప్రభుత్వం విధానం వల్ల 2 సంవత్సరాలుగా విద్యారులకు పాత పద్దతిలో అందించే విదానాన్నికి తుంగలో తొక్కి,గత ప్రభుత్వం ఎవ్వరికి దోచి పెట్టడానికో తెలవదు గాని వాటిని పోస్టాఫీసు కి తరలించి ఒక్కొక్క విద్యార్ధికి పాఠ్యపుస్తకాలను పోస్టాఫీసు ద్వారా పంపడం జరిగింది.
దీనికి గాను ఒక్కోక్క విద్యార్ధికి పుస్తకాల ప్యాకింగ్ మరిము పోస్టర్ చార్జీల కు రుసుముగా 150/-రూ ఖర్చు చేయడం జరిగిందనే తెలుస్తోంది.అంటే విద్యా సంవత్సరానికి సుమారు ఒక్క కోటి యాభై లక్షల రూపాయల ప్రభుత్వ ఖజానా సొమ్ము వృధా అయ్యిందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.గత ప్రభుత్వం తీసుకున్న విధానం వల్ల డ్రాప్ అవుట్ అయ్యి ఓపెన్ లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కనీసం రెండు శాతం నుండి ఐదు శాతం లోపే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిన్నట్లు సమాచారం.దీని వల్ల ప్రభుత్వం ఉన్నత లక్ష్యం పక్కదారి పట్టి ఇప్పటికే ప్రభుత్వ సొమ్ము సైతం దుర్వినియోగం అయిన్నట్లు విశ్వసనీయ సమాచారం.చదువు మధ్యలో ఆపివేసిన వారు ఆపాస్ (ఏపి.ఓ.యస్.యస్)నందు విద్యార్థులుగా చేరడం కోసం ఆన్లైన్ అప్లికేషన్ చేయుట కొరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం నెట్ సెంటర్ పై ఆధార పడటం జరుగుతుంది.విద్యార్థుల ఆధార్ కార్డులో ఒక్క అడ్రస్ ప్రస్తుతం విద్యార్థులు నివసిస్తున్న అడ్రస్సు మరోచోట ఉండటం జరుగుతుంది.కాని నెట్ సెంటర్ వారు ప్రస్తుత అడ్రస్ కి బదులుగా ఆధార్ లోని అడ్రస్ ప్రకారం ఆన్లైన్ చేయటం వలన విద్యార్థుల అడ్రస్ లు గల్లంతు అయ్యిందనే చెప్పుకోవచ్చు.గత విద్యా సంవత్సరం విద్యార్థులకు,పుస్తకాలు ఆలస్యంగా పంపడమే కాకుండా అన్ని పంపినట్లు ఆపాస్ లెక్కలు వ్రాసుకొని చేతులు దులుపుకున్నారు.దీనితో అత్యధిక శాతం పాఠ్యపుస్తకాలు అందక పోవడంతో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం ఘనంగా పడిపోయి ఆపాస్ అధికారుల తప్పుల వల్ల ప్రస్తుత అధికార పార్టీకి ఈ ఉత్తీర్ణత శాతం చరిత్రలో ఒక్క మచ్చగా మిగిలి పోయిందనే చెప్పుకోవచ్చు.
ఇప్పటికే ఆపాస్ చేసిన పొరపాట్లను ఈ సంవత్సరం జరిగిన పరీక్షల నిర్వహణ లో వచ్చిన తప్పులను పత్రికలు సైతం కోడై కూసిన సంగతి అందరికి విదితమే.అయినప్పటికి రాష్ట్రంలో కొన్ని శాఖలలో జరిగిన అవినీతి ని వెలుగులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం,ఆపాస్ విషయంలో గత పాలకుల హయ్యాంలో అధికారులు చేసిన తప్పిదాలతో ప్రభుత్వ ఖజానా సొమ్ము పక్కదారి పట్టి ఏ విధంగా దుర్వినియోగం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీని పై ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేసి విచారణ చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందోనని పలువురు ఆశ్చర్యాని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సునాయసంగా పాఠ్యపుస్తకాలు అందించడం కోసం జిల్లా విధ్యాశాఖాధికారి ద్వారా ప్రభుత్వ అనుమతులు పొందిన ఏఐ కోఆర్డినేటర్ ద్వారా పుస్తకాలను విద్యార్ధులకు అందించడం మూలానా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాదని పలువురు మేధావులు తెలియజేస్తున్నారు.ఆపాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ప్రజలు వేచి చూడాల్సి ఉంది.
What's Your Reaction?






