అంతా జలమయం అంటున్న జిడ్డు కాలనీ వాసులు

చిలకలూరిపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 6, 2023 - 10:00
Dec 6, 2023 - 10:01
 0  63
అంతా జలమయం అంటున్న జిడ్డు కాలనీ వాసులు

మంత్రి రజిని,మున్సిపల్ అధికారుల వైఫల్యంతో అంతా జలమయం అంటున్న జిడ్డు కాలనీ వాసులు

మంత్రి రజిని ఇంటి నిర్మాణం వలన మురుగు కాలువను పక్కకు మళ్ళించారనే ఆరోపణలు..

చిలకలూరిపేట:

పట్టణంలోని 38వ వార్డు జిడ్డు కాలనిలోని గంగమ్మ తల్లి ఆలయం ప్రక్కన ఉన్న నల్ల కుంట  వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఏపి గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు,మున్సిపల్ చైర్మన్ షేక్

రఫాని లకు 27వ తేదీన వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు నాయక్ మాట్లాడుతూ వర్షకాలం కావడం వలన చుట్టు ప్రక్కల ఉన్న వ్యవసాయ  భూములో నుంచి నీరు అంతాయు అందులో చేరుతుంది. అదేవిధంగా కాలని మురుగునిరు సైతం అందు లో చేరుతుంది. నివాస గృహాలు చెరువుకు అనుకోని ఉండటం వలన డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ఇబ్బందులు పడుతూన్నాము, క్రిమి కీటకాలు, విష సర్పాలు బయటకు వస్తున్నాయి. గతంలో విష జ్వరాలతో  సుమారు 9 నుంచి 15 సంవత్సారాల వయస్సు గల చిన్న పాపచనిపోయిందని వినతి పత్రంలో ఆనాడు పేర్కొన్నారు.

ప్రధానంగా రెండు మురుగు కాలువలు ఏర్పాటు చేసి నీరు బయటకు వెళ్ళుటకు రెండు కల్వర్టులు నిర్మాణాలు చేపట్టాలన్నారు. నీటి కుంటను పూడ్చి ఎస్టీలకు కమ్యూనిటీ హాలు, , పార్కు నిర్మాణం చేపట్టాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య ద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినికి విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యలు పరిష్కారం చేసి విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని కొరియున్నామన్నారు. అదే విధంగా మురుగు కాలువను సమస్యను వివరించమన్నారు. 

-తెలంగాణకు రెండో సీఎం గా రేవంత్ రెడ్డి ....చదవండి.. https://studiobharat.com/Revanth-Reddy-as-the-second-CM-of-Telangana ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...

ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అధికారులు తక్షణమే సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. ఇంతవరకు దాని ఉసే ఎత్తడం లేదు... వర్షపు నీరు అంతయు కాలనీ చుట్టూత చేరి ఉంది. కాలనీ మొదటి భాగం అవుతాయి... చెరువును తలపించేలా ఉంది. ఇదంతా మంత్రి రజిని, మున్సిపల్ అధికారుల వైఫల్యమేనని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో గంగమ్మ దేవాలయం సమీపంలో మంత్రి రజిని గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు.

గృహానికి అనుకోని గతంలో పెద్ద మురుగు కాలువ ఉంది.ఆకాలువ గుండా గణపవరం కాలువలో కలుస్తుంది. ఈ కాలువ వారి ఇంటి ఎదుట నుంచి మళ్లించడం వలన సరిగ్గా నీరు కాలువ నుంచి పోవడం లేదు, ఈ విధంగా చేయడం వలన వర్షాలు పడుతున్నప్పుడు కాలనీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు సత్వర మేలుకొని పరిష్కారం చేస్తారో.. లేదో వేచి చూడవలసి ఉంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow