జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన పోచారం రుషాంక్ రెడ్డి

కలకత్తా స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 30, 2024 - 04:46
 0  34
జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన పోచారం రుషాంక్ రెడ్డి

జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన పోచారం రుషాంక్ రెడ్డి

కలకత్తా 

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా లో జరిగిన 2వ ఆసియా చేస్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో మరియు ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ బాక్సింగ్ 2024 లో సబ్ జూనియర్ ఫిట్ చెస్ బాక్సింగ్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన బాన్సువాడ కు చెందిన పోచారం రుషాంక్ రెడ్డి.

రుషాంక్ రెడ్డి మాజీ స్పీకర్, మాజీ మంత్రి,బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవడు,మాజీ నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుమారుడు.కలకత్తా లోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోచారం రుషాంక్ రెడ్డి కేరళకు చెందిన క్రీడాకారుని పై విజయం సాధించి బంగారు పతకం సాధించారు.తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించి సీనియర్ మహిళా విభాగంలో కామారెడ్డి జిల్లా పిట్లం కు చెందిన క్రీడాకారిణి వరల్డ్ చాంపియన్ తకడ్పల్లి ప్రతిభ 5 గోల్డ్ మెడల్స్,సబ్ జూనియర్స్ విభాగం లో బాన్సువాడ కు చెందిన రుషాంక్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్,సీనియర్ పురుషుల విభాగంలో పిట్లం కు చెందిన తకడ్పల్లి విజయ్ రాఘవేంద్ర 2 సిల్వర్ మెడల్స్ సాధించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow