కొత్త రేషన్ కార్డ్స్,ఇందిరమ్మ ఇండ్లు అందించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 20, 2025 - 07:20
 0  113
కొత్త రేషన్ కార్డ్స్,ఇందిరమ్మ ఇండ్లు అందించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డ్స్,ఇందిరమ్మ ఇండ్లు అందించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. 

రేషన్ కార్డుల జారీ,ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియ చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ పథకాలు అందించాలి.

ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారు గ్రామ సభలలో అర్జీలు సమర్పించవచ్చని స్పష్టీకరణ

ఈనెల 21 నుంచి గ్రామసభలు ప్రారంభం.

గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.

సంగారెడ్డి 

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు.ఆదివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా లోని ప్రత్యేక అధికారులు,ఆర్డీవోలు ఎంపీడీవోలు తహసిల్దార్లు నియోజకవర్గం ప్రత్యేక అధికారులతో ఆమె మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు జారీ వంటి పథకాలపై, ఈనెల 21 నుండి చేపట్టనున్న గ్రామసభలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియని, చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డ్స్ అందించడంజరుగుతుందని,ఇంతకుముందు జరిగిన సర్వేలలో ఎప్పుడు దరఖాస్తు ఇవ్వకపోయినా గ్రామ సభ కి వచ్చి దరఖాస్తులు ఇస్తే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు.ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామసభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారిచేసినట్లు కలెక్టర్ అధికారులు వివరించారు. ప్రస్తుతం రేషన్ కార్డ్ ల లబ్ధిదారుల జాబితా సామాజిక ,ఆర్ధిక, కుల, రాజకీయ సర్వే ఆదారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 ప్రతిష్టాత్మక పధకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి అమలుకు శ్రీకారం చుట్టబోతుందని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలలో దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పులకై దరఖాస్తులు స్వీకరించాలని ఆమె స్పష్టం చేశారు. గతంలో స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

 ఈనెల 26 ప్రారంభించనున్న నాలుగు పథకాలపై 21వ తేదీ నుండి ప్రారంభమయ్యే గ్రామసభల్లో ప్రజా అభిప్రాయలు,ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు గ్రామ సభలు,ప్రజా పాలన సేవా కేంద్రాలలో కొత్తగా చేసుకున్న దరఖాస్తులు,ఎంపిడిఓ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మాత్రమే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.ఇంటి స్థలం ఉన్నవారు, ఇంటిస్థలం లేని వారి రెండు జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించాలని,అలాగే కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు జారీకి అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందని అన్నారు.

వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్కు 6000/- రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000/- రూపాయలు ప్రతి ఎకరానికి ఇవ్వబడుతుందని చెప్పారు.ప్రతి నిరుపేద భూమిలేని కుటుంబము 2023 - 24 సంవత్సరానికి 20 రోజుల ఉపాధి హామీ పని చేసి ఉంటే ఆ కుటుంబానికి ప్రతి సీజన్కు 6000/- రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000/- రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద ఇవ్వబడుతుంది.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇంటి యజమాని పేరు మహిళా అయి ఉండాలని,మహిళ యొక్క బ్యాంక్ ఖాతా నెంబరు ఆధార్ నెంబరు ను ఉపాధి హామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలన్నారు.

గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు,ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూములు,రియల్ ఎస్టేట్ భూములు,తదితర వ్యవసాయానికి పనికిరాని భూముల వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ టీములు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ,రెవిన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసాకు అర్హులైన లబ్దిదారులను గుర్తించాలన్నారు.

ఈ నెల 21 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామసభల వద్ద ప్రజల కు మంచి నీరు, కుర్చీలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow