విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.
కొత్తవలస స్టూడియో భారత్ ప్రతినిధి
రెండు రైళ్లు ఢీ.. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..
విజయనగరం:
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది.విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగి ఉంది..
అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది.రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు.పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నామన్నారు.ఇప్పటికే సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరిననట్లు డీఆర్ఎం తెలిపారు.
ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి.ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది.రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి.దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది..
What's Your Reaction?