గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పుల గురించి ప్రజలకు తెలియాలి కదా : మంత్రి శ్రీధర్ బాబు
స్టూడియో భారత్ ప్రతినిధి

గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పుల గురించి ప్రజలకు తెలియాలి కదా : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ముక్కు సూటి మనిషి అని..గత ప్రభుత్వం చేసిన తప్పుల అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.మీడియాతో మంత్రి చీట్ చాట్ నిర్వహించారు.
బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారు.బీజేపీ కేంద్రం లో పాలన చేతకాక పోతే దిగిపోవాలని అంటున్నారు.మరి పెహల్గం వైఫల్యంకి ఎవరు దిగిపోవాలి,మోడీ దిగిపోవాలని,మేము అన్నామా!బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..?మోడీ విదేశాలకు పోతే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా..?అని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ఒకరిద్దరు బెదిరించినట్టు మాట్లాడారు.దానికి హార్ట్ అయ్యి ఉంటారన్నారు. హెలికాప్టర్ ప్రభుత్వం అద్దెకు తీసు కుందని.. మంత్రులు జిల్లాలు తిరిగితే… కార్ల కంటే హెలికాప్టర్ ఖర్చు తక్కువన్నారు. ఇప్పుడున్న హెలికాప్టర్ గత ప్రభుత్వం హయంలోనే అద్దెకు తీసు కున్నారని.వాళ్లు తిరగకుం డా రెంట్ కట్టారని చెప్పారు.
సీఎం ఆవేదనతో మాట్లా డటానికి గల కారణాన్ని మంత్రి శ్రీధర్ బాబు చెప్పు కొచ్చారు.ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి మాట్లాడారు సీఎం.చిన్నా భిన్నం చేసిన ఆర్ధిక విధానం చూసి ఆవేదనతో మాట్లా డారు.నేను ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేయాలి.డబ్బులు లేవు అనే ఆవేదన సీఎం లో ఉంది.
బీఆర్ఎస్ వాళ్లకు పేగు బంధం ఉంటే…
జీతాలే సరిగా వేయలేదు.వాళ్లకు ప్రేమ ఉన్నట్టా..?మేం రాగానే డీఏ ఇచ్చాం. వాళ్ళలాగా మేము వదిలేయలేదు. కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పులు కూడా ప్రభుత్వమే కడుతుంది.కేటీఆర్.. ప్రభుత్వం చేసిన అప్పుల గురించే మాట్లాడుతున్నారు” వాళ్లు చేసే తప్పుల గురించి మాట్లాడటం లేదు అని మంత్రి శ్రీధర్ బాబు వాక్యానించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దివాళ తీయించింది కెసిఆర్ కాదా?అని ఆయన ప్రశ్నించారు.దాని నుంచి బయట పడేసే పనిలో మేమున్నామని, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. “సెక్రటేరియట్ హోం ఐతే.. వాళ్ళు ఉండేది ఫార్మ్ హౌసా..?ఉద్యోగస్తులు మా సోదరులు..మా మిత్రులే.ఆలస్యం అయినా..అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం.
తెలంగాణలోనే కాదు..దేశ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అయినా..వనరులు పెంచి..నిధులు తెచ్చే పనిలో ఉన్నాం.లక్ష కోట్లు తెచ్చు కాళేశ్వరంలోనే పెట్టారు కేసీఆర్.
గత ప్రభుత్వం చేసిన దివాలా ఈ వ్యవస్థ గురించి ప్రజలకు తెలియాలి అని చెప్పారు.అప్పుల గురించి ప్రజలకు తెలియాలి కదా?చెప్పకపోతే ఎలా?రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్ ఇవ్వలేక..కేసీఆర్ ఉద్యోగుల పదవి కాలాన్ని పెంచారు.కానీ మేము యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం.అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
మవోయిస్టుల ఎన్‌కౌంటర్లపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.మావోయిస్టుల తో మా కుటుంబానికి అన్యాయం జరిగింది.కానీ ఇంకో కుటుంబానికి అన్యాయం జరగొద్దు అనేది మా ఆలోచన.శాంతి చర్చలు కోరడం తప్పు కాదు.మా ప్రభుత్వమే గతంలో మావోయిస్టుల తో చర్చ చేసిందని గుర్తు చేశారు.
What's Your Reaction?






