పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతిపత్రం

ఖానాపూర్ స్టూడియో భారత్ ప్రతినిధి

Jun 26, 2024 - 06:15
 0  7
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతిపత్రం

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతిపత్రం

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్

పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నిర్మల్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ

ఖానాపూర్ మండలంలోని ఎక్బాల్ పూర్ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్నారు.గత ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని సర్వేలు ప్రారంభించారు.అప్పుడు గ్రామం లో సాగు చేస్తున్న భూములను సర్వ చేశారు.కానీ గ్రామం ప్రభుత్వపరంగా ఆన్లైన్లో లేకపోవడం వలన గత ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు.అందువలన పోడు సాగుదారులు నష్టపోయారు.పట్టాలు ఇవ్వలేదు.సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ గ్రామానికి పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దుర్గం లింగన్న,ఐఎఫ్టియు నాయకులు ముంజ దేవేందర్,మాలావత్ జే,గోవింద్,గోపీచంద్,గుగ్లావత్ గౌను,లావుడ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow