ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులుగా ఇందిర మారెళ్ల

చిలకలూరిపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 4, 2023 - 16:16
 0  24
ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులుగా ఇందిర మారెళ్ల

ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులుగా ఇందిర మారెళ్ల ప్రమాణ స్వీకారం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట

ఇన్నర్ విల్ క్లబ్ అధ్యక్షపదవీ బాధ్యతలు చేపట్టిన ఇందిర మారెళ్ల, కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాయిని హరితా లను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గత సంవత్సరం ఇన్నర్ వీల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలను గత సంవత్సర అధ్యక్షులు గా పని చేసిన రాజ్యలక్ష్మి వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ కందిమళ్ళ జయమ్మ,కొమ్మినేని వీరశంకరరావు,డాక్టర్ ముద్దన రమేష్ ,ఇన్నర్ వీల్ చైర్మన్ కోలా విజయలక్ష్మి హాజరయ్యారు.డాక్టర్స్ డే సందర్భంగా చిలకలూరిపేటకి ఎనలేని వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ డాక్టర్లు, డాక్టర్ కందిమళ్ళ జయమ్మ ,డాక్టర్ కొమ్మినేని వీర శంకర్ రావు, డాక్టర్ ముద్దన రమేష్ లను గార్లకు ఘనంగా సన్మానం చేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టిన మారెళ్ళ ఇందిర మాట్లాడుతూ ఇన్నర్ వీల్ స్థాపించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం మా టీమ్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్,సేవ్ సాయిల్,ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్స్,మరిన్ని చెట్లు నాటడంతో పాటు ప్రజల్లో వీటిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని,ఇన్నర్ వీల్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తామని తెలియజేశారు.

ఇది కూడా చదవండి... Married-sons-in-Jagat-Kiladi-lady-net

కారుమంచి శివరావు వారి సతీమణి సరళా దేవి జ్ఞాపకార్ధం రూ. 25000 వేలు,డాక్టర్ వీర శంకరరావు రూ 10000 వేలు,మారెళ్ల అప్పారావు మొక్కలు నాటే కార్యక్రమానికి రూ.10116 లు ,యలమంచిలి నవీన యు యస్ ఏ,కుట్టు మిషన్ ను ఇన్నర్ వీల్ క్లబ్ కు విరాళంగా అందించారు. ఇన్నర్ వీల్ ఆధ్వర్యంలో ఇద్దరు పిల్లలకు పది వేల రూపాయల స్కాలర్ షిప్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులతోపాటు రోటరీ క్లబ్ చిలకలూరిపేట, రోటరీ క్లబ్ పండరీపురం, ఓయాసిస్ సభ్యులు, అసిస్ట్ సభ్యులు, పలువురు డాక్టర్స్ పాల్గొన్నారు...!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow