సన్న బియ్యం పంపిణీ తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు

సూర్యాపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 6, 2025 - 03:31
 0  53
సన్న బియ్యం పంపిణీ తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు

సన్న బియ్యం పంపిణీ తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు

  • లబ్దిదారుడి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం
  • రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఇండ్లలో ప్రజాప్రతినిధులకు భోజనం
  • మూడు కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం
  • ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా 6 కిలోలు
  • ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట
  • రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ 

సూర్యపేట 

పేదరికంలో ఉన్న నిరుపేదలందరికకి నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమని సూర్యాపేటలో సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భోజనం చేశారు.మార్చి 30 ఉగాది పర్వదినం రోజున హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించారు.సన్న బియ్యం పంపిణీ కార్యక్రమముతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన మీదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా ప్రజా ప్రతినిధులను తమ ఇండ్లలో వండిన సన్న బియ్యం అన్నాన్ని తినడానికి ప్రజలు అహ్వానిస్తున్నారని ఆయన చెప్పారు.

అందులో భాగంగ శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్దిదారుడి ఆ ఇంట్లో భోజనం చేస్తారని ఆయన తెలిపారు.శుక్రవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో ఉంటున్న సన్న బియ్యం లబ్ధిదారుడు పాలడుగు బుజ్జమ్మ-వెంకటయ్య దంపతుల ఇంట్లో నాణ్యమైన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులందరు సన్న బియ్యం లబ్దిదారుల ఇండ్లలో భోజనం చేస్తారని ఆయన తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం పంపిణీనీ పేదలకు ఉచితంగా అందిస్తామన్నారు.ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఉచితంగా 6 కె.జి ల నాణ్యమైన సన్న బియ్యం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

వినాశనానికి ఎక్కువ సమయం లేదు సిద్ధంగా ఉండండి.. - https://studiobharat.com/There-is-not-much-time-left-for-destruction-be-prepared

ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందనడానికి ఇంతకు మించిన సంక్షేమ పధకం మరోకటి ఉండ భోదన్నారు.రాష్ట్ర జనాభాలో 84 శాతానికి సన్న బియ్యం పంపిణీ ఉంటుందన్నారు.నిరు పేదలందరికి నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow