రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 21, 2024 - 06:55
 0  15
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఓ ప్రకటనలో వివరించారు.

పదేళ్లపాటు అస్తవ్యస్త విధానాలతో రైతులను అగమ్యగోచరంగా చేశారని..

ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవ సర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.పదేళ్లలో ఏనాడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వని వాళ్లు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆక్షే పించారు. కేవలం ఎన్నికల కు ముందు రూ.150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని.. రెండో మారు జీవో మాత్రమే ఇచ్చి చేతు లు దులుపేసు కున్నారని ఆరోపించారు.మూడోసారి కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని దుయ్యబట్టారు. గత మే నెల వరకు కూడా రైతుబంధు నిధులు జమ చేసిన నేతలు.. ఇవాళ తమను తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల అభ్యం తరం వ్యక్తం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow