పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజలు

ఖమ్మం స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 24, 2023 - 19:32
 0  81
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజలు

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజలు

ఖమ్మం :

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆకాంక్షించారు.జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కమిషనర్ ఆయన సతీమణి హృదయ మేనాన్ కుటుంబ సమేతంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ,శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుంది.విజయం చేకూర్చే విజయదశమి పర్వదినాని పురస్కారించుకొని జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని,పోలీసుల గౌరవం,కీర్తిప్రతిష్టలు పెంపొందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు,అడిషనల్ డీసీపీ (ఏఆర్ ) కుమారస్వామి,ఏసీపి లు గణేష్ ,హరికృష్ణ, భస్వారెడ్ధి, ప్రసన్న కుమార్,నర్సయ్య ,ఆర్ ఐ లు కామరాజు,శ్రీశైలం,సురేష్,  సాంబశివరావు, సిఐలు  స్వామి, సత్యనారాయణ,శ్రీధర్, చిట్టిబాబు,సతీష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow